Rajamouli Mark: రాజమౌళి మార్క్ స్ట్రాటజీ.. భారీ డీల్ సెట్?

Rajamouli Mark: దర్శక ధీరుడు రాజమౌళి తాజాగా తెరక్కించిన ‘ఆర్ఆర్ఆర్’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి అందరికి తెల్సిందే. జనవరి 7న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంతోనే చిత్రయూనిట్ అదిరిపోయే రీతిలో ప్రమోషన్స్ మొదలు పెట్టింది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా  ప్రమోషన్స్ చేస్తూ ఈమూవీపై అంచాలను పెంచేస్తున్నారు. ‘బాహుబలి’ని మించేలా ప్రమోషన్స్ చేస్తుండటాన్ని సినీప్రియులంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. రాజమౌళి సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈమూవీ ఇప్పటికే భారీగా […]

Written By: NARESH, Updated On : December 14, 2021 3:15 pm
Follow us on

Rajamouli Mark: దర్శక ధీరుడు రాజమౌళి తాజాగా తెరక్కించిన ‘ఆర్ఆర్ఆర్’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి అందరికి తెల్సిందే. జనవరి 7న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంతోనే చిత్రయూనిట్ అదిరిపోయే రీతిలో ప్రమోషన్స్ మొదలు పెట్టింది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా  ప్రమోషన్స్ చేస్తూ ఈమూవీపై అంచాలను పెంచేస్తున్నారు. ‘బాహుబలి’ని మించేలా ప్రమోషన్స్ చేస్తుండటాన్ని సినీప్రియులంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

Rajamouli Mark

రాజమౌళి సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈమూవీ ఇప్పటికే భారీగా మార్కెట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే నిర్మాత డీవీవీ దానయ్యకు పట్టుండగా రాజమౌళి తన మార్క్ స్ట్రాటజీతో నార్త్, సౌత్ ఇండస్ట్రీల్లో భారీ డీల్స్ సెట్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మేకింగ్ ప్రమోషన్స్ నుంచి సినిమా బిజినెస్ వరకు కూడా రాజమౌళినే దగ్గరుండి చూసుకుంటున్నాడు. తాజాగా రాజమౌళి వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం ‘ఆర్ఆర్ఆర్’కు పెద్ద ప్లస్ అయింది.

‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ఫిక్సయిన వెంటనే రాజమౌళి పీవీఆర్ సినిమాస్ తో డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. పెద్ద సినిమాలన్నీ మల్టిపెక్సుల్లో విడుదల కావడం కామానే అయిన ఇక్కడే రాజమౌళి తన మార్క్ స్ట్రాటజీని అవలంభించి చిత్రానికి మరింత బిజినెస్ జరిగేలా చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ కు సంక్రాంతి రేసులో నిలిచింది.

అయితే ఈ మూవీకి పోటీగా పవన్ కల్యాణ్ ‘బీమ్లానాయక్’, ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’, తమిళంలో ‘వలిమై’ సంక్రాంతి రేసులో నిలిచి గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. దీనిని ముందుగానే ఊహించిన జక్కన్న దేశంలోనే అతిపెద్ద థియేట్రికల్ చైన్ ఉన్న పీవీఆర్ తో డీల్ కుదుర్చుకున్నారు.

Also Read: అల్లు అర్జున్ తమిళంలో ఎలా మాట్లాడాడో తెలుసా? చూస్తే తట్టుకోలేరు?

ఇందులో భాగంగానే ‘ఆర్ఆర్ఆర్’కు పీవీఆర్ మల్టిపెక్సులో రెండు మూడు వారాలపాటు మేజర్ స్క్రీన్లు దక్కనున్నాయి. వీరంతా ‘ఆర్ఆర్ఆర్’ డీల్ కుదుర్చుకోవడంతో వేరే సినిమాల విషయంలో రాజీపడే అవకాశం ఉండదు.అలాగే తమ థియేటర్లో విడుదలవుతున్న ప్రతీ షోలోను ‘ఆర్ఆర్ఆర్’ ప్రోమోలు వేసి రిలీజుకు ముందే భారీగా ప్రమోట్ చేయనున్నారు.

ఇది ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు మరింత ప్లస్ కానుంది. మొత్తంగా రాజమౌళి తన మార్క్ స్ట్రాటజీతో ‘ఆర్ఆర్ఆర్’కు భారీ కలెక్షన్లు వచ్చేలా భారీగానే ప్లాన్ చేసినట్లే కన్పిస్తోంది. దీంతో ఈ సినిమా రిలీజు అయ్యాక ఎలాంటి రికార్డులను కొల్లగొడుతుందనే ఆసక్తి సినీప్రియుల్లో నెలకొంది.

Also Read: ” పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ ” ను అనౌన్స్ చేసిన బంగార్రాజు టీమ్…