https://oktelugu.com/

Malupu Cover Song: మలుపు అంటూ ప్రేయసి తో జోడీ కట్టి సెన్సేషన్ క్రియేట్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్‌..

Malupu Cover Song: తానొక యూట్యూబ్ సెన్సేషన్, ప్రస్తుత ఉన్న యువతకి పరిచయం లేని పేరు, తాజా గా ఇప్పుడు అందరి నోరుల్లో నానుతున్న బిగ్ బాస్ షో కంటెస్టెంట్‌ – ఇంక ఎవరో కాదు షణ్ముఖ్ జస్వంత్. అంతే కాకుండా తన బర్తడే సెలబ్రేషన్స్ తో బిగ్ బాస్ హౌస్ లో కూడా ఒక రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఈ సెన్సేషన్ స్టార్. సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య వెబ్ సీరీస్ ల తో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : September 17, 2021 / 04:02 PM IST
    Follow us on

    Malupu Cover Song: తానొక యూట్యూబ్ సెన్సేషన్, ప్రస్తుత ఉన్న యువతకి పరిచయం లేని పేరు, తాజా గా ఇప్పుడు అందరి నోరుల్లో నానుతున్న బిగ్ బాస్ షో కంటెస్టెంట్‌ – ఇంక ఎవరో కాదు షణ్ముఖ్ జస్వంత్. అంతే కాకుండా తన బర్తడే సెలబ్రేషన్స్ తో బిగ్ బాస్ హౌస్ లో కూడా ఒక రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఈ సెన్సేషన్ స్టార్.

    సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య వెబ్ సీరీస్ ల తో వరుస విజయాలను అందుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబ్ సెన్సేషన్ షణ్ముఖ్ జస్వంత్.  కొద్ది నెలల క్రితం తన జీవితం లో జరిగిన ఒక సంఘటన తన జీవితాన్ని తలక్రిందులు చేసింది. దాని తర్వాత బిగ్ బాస్ అనే రియాలిటీ షోలో అవకాశం వచ్చింది. ఒక కవర్ సాంగ్ తో ఇప్పుడు ప్రేయసితో జోడీ కట్టి అందరి దృష్టి ని తన వైపుకు తిప్పుకున్నాడు.

    చాలా రోజుల తర్వాత తన ప్రేయసి దీప్తి సునయన తో జోడి కడుతున్నాడు మిస్టర్ షన్ను. మలుపు కవర్ సాంగ్ లో  గుర్తుంచుకోవాల్సిన విషయాలు మూడు ఉన్నాయి. ఎందుకంటే- చాలా రోజుల తర్వాత ప్రేయసి దీప్తి సునయన తో జత కట్టడం, తన “మలుపు” కవర్ సాంగ్ ను అతి పెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ లో ఉన్నప్పుడు విడుదల చెయ్యడం, ఇంకొక విషయం “మలుపు” సెప్టెంబర్ 16 న రిలీజ్ కావటం, అది కూడా షన్ను పుట్టిన రోజు అవ్వటం. పుట్టిన రోజు సందర్భంగా తన ప్రేయసి దీప్తి సునయన తో జత కట్టి ఇంకోసారి యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు మిస్టర్ షన్ను. విడుదల అయ్యి ఇంకా ఒక్కరోజు కూడా గడవలేదు. కాని 3 మిలియన్ల వ్యూస్ తో  ట్రెండింగ్ 1 లో ఉంది.