spot_img
HomeNewsబిగ్ బాస్ హౌస్‌ లో ప్రేమలు ఎక్కువ కాలం ఉండవు !

బిగ్ బాస్ హౌస్‌ లో ప్రేమలు ఎక్కువ కాలం ఉండవు !

బిగ్ రియాలిటీ షో  బిగ్ బాస్ షోకు వెళ్లకముందే  సింగర్ రాహుల్, బబ్లీ బ్యూటీ  శ్రీముఖి మంచి స్నేహితులు అట. కానీ బిగ్ బాస్ షో ఈ ఇద్దరి మధ్య కాస్త దూరం పెంచింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు   ఈ ఇద్దరూ  బద్ద శత్రువులుగా మారారు. మొదట్లో సరదాగా సాగిన వీరి బంధం ఆ తరువాత కాస్త ముదిరింది.  ఒక విధంగా   శ్రీముఖి శత్రుత్వమే రాహుల్‌ను విజేతగా నిలబెట్టిందని కూడా కామెంట్స్ వినిపించాయి అంటే..  వీరి మధ్య నడిచిన డ్రామా ఏ రేంజ్ లో ఉండి ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.  అందుకే బిగ్ బాస్ హౌస్ బయటకు వచ్చాక  కూడా రాహుల్ శ్రీముఖి ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు.

Also Read: బిగ్ సిక్రెట్ రిలీవ్ చేసిన రాహుల్ సింప్లిగంజ్..!

కాగా  బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్లు ఎన్ని పార్టీలు చేసుకున్నా కూడా,  శ్రీముఖి మాత్రం హాజరు కాలేదు, కారణం అక్కడ తనకు నచ్చిన వ్యక్తులు కొంతమంది ఉన్నారట. వారిలో రాహుల్ ముఖ్యమైన వ్యక్తి అట.   అయితే తాజాగా శ్రీముఖితో ఉన్న రిలేషన్ గురించి రాహుల్ తన మనసులో మాటను బయట పెట్టాడు.  శ్రీముఖిని నేను వదిలేయలేదు. ప్రొఫెషనల్ పరంగా  మేము ఇద్దరం కలిసే ఉన్నాం.  రీసెంట్‌గానే మేము కలిసి ఒక ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది.  ఇప్పటికి  మా మధ్య మంచి రిలేషన్ ఉంది.. గొడవలేం లేవు. అనవసరంగా మా గురించి నెగిటివ్ గా రాయకండి.

Also Read: బిగ్ బాస్ హౌస్ లో మరో ప్రేమజంట !

అయినా మీ అందరికీ ఓ విషయం చెప్పాలి.  బిగ్ బాస్ హౌస్‌లో గొడవలు.. ప్రేమలు ఎక్కువ కాలం ఉండవు అని మొత్తానికి  రాహుల్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. పైగా  హౌస్ లో  మొదలైన ప్రేమ పెళ్లి వరకు వెళ్లినా కాపురం నిలబడదని కూడా తేల్చి  చెప్పేశాడు. మరి ఈ మాటను మనోడు ఎవర్ని ఉద్దేశించి చెప్పాడో. ఇక తన లైఫ్‌లో కూడా  ప్రేమకథలు చాలా ఉన్నాయని కూడా  రాహుల్  బాబు చెప్పుకొచ్చాడు. మరి ఆయనగారు  తన  ప్రేమ కథలు గురించి అప్రస్తుతంగా ఎందుకు చెప్పాడో ఆయనకే తెలియాలి.  అలాగే బాబు  తన దృష్టిలో ప్రేమకథ అంటే మనిషిని మనిషి ప్రేమించడం  అని ఏదేదో చెప్పాడు.  


మరిన్ని సినిమా వార్తల కోసం:టాలీవుడ్ న్యూస్

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Tammineni Family

Tammineni Family: ఒడిస్సాలో చిక్కిన తమ్మినేని ఫ్యామిలీ?!

Tammineni Family: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో నాలుగు కోట్ల భూమిని అక్రమంగా కొల్లగొట్టారు అని...
YSRCP

YSRCP: వైసీపీకి ఆ జిల్లాలో భారీ డ్యామేజ్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం నడుస్తోంది. ఇప్పటివరకు పాత కేసుల్లో నేతలు అరెస్ట్ అవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు...
Operation Prahaar

Operation Prahaar: ఆపరేషన్ ‘ప్రహార్’.. ఉగ్రవాద అంతంపై మోడీ-షా ల అద్భుత వ్యూహమిదీ

Operation Prahaar: భారతదేశంలో ఉగ్రవాదం ఎప్పుడూ కొత్త సవాలు కాదు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి ప్రోత్సాహం పొందుతున్న ఉగ్రవాదం, పంజాబ్‌లో ఖలిస్తానీ కార్యకలాపాలు, దండకారణ్యంలో నక్సలిజం ఇవన్నీ దేశ భద్రతకు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Oktelugu Epaper