Krish Comments on HHVM: ఎన్నో ఏళ్ళ నుండి అభిమానులు ఊరిస్తూ వచ్చిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది కానీ, సెకండ్ హాఫ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మీరు సినిమా చూసుంటే మీకు అర్థం అయ్యి ఉంటుంది, ఒకవేళ చూడకపోయినా చూసిన వాళ్ళు చెప్పింది వైన్ ఉంటారు. అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం తీసింది డైరెక్టర్ క్రిష్(Krish Jagarlamudi) అనేది అందరికీ తెలిసిన విషయం. ఆయన తీసిన సన్నివేశాల వరకు చాలా బాగా వచ్చాయి. క్రిష్ ఈ సినిమాకు డైరెక్టర్ గా చివరి వరకు కొనసాగి ఉండుంటే వేరేలా ఉండేది. పోనీ క్రిష్ వెళ్లిపోయిన తర్వాత ఆ సినిమాని ఆయన తప్ప ఎవ్వరూ చెయ్యలేరు అని భావించి సినిమాని ఆపేసి ఉన్నా బాగుండేది.
Also Read: కోర్ట్, కన్నప్ప కంటే దారుణమా…. హరి హర వీరమల్లుకి ఊహించని దెబ్బ!
ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే డైరెక్టర్ క్రిష్ ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో యాంకర్ ‘హరి హర వీరమల్లు’ గురించి అడుగుతూ ‘మీరు హరి హర వీరమల్లు నుండి ఎందుకు తప్పుకున్నారు?, పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) గారికి మీకు క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వల్లే మీరు వెళ్లిపోయారని అందరూ అంటున్నారు.నిజమేనా?’ అని అడగ్గా, దానికి డిరెక్టర్ క్రిష్ సమాధానం చెప్తూ ‘పవన్ కళ్యాణ్ గారితో నాకు ఎలాంటి విభేదాలు లేవు, అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. ఒక సమయం చూసుకొని ఎందుకు ‘హరి హర వీరమల్లు’ నుండి తప్పుకోవాల్సి వచ్చిందో వివరంగా అందరికి చెప్తాను. పవన్ కళ్యాణ్ గారితో నాకు ఎలాంటి క్రియేటివ్ డిఫరెన్ లేదు. ఆయన అనుమతిస్తే ఆయనతో కలిసి ఒక సినిమా చేయడానికి కూడా నేను రెడీ. హరి హర వీరమల్లు సినిమా రీసెంట్ గానే విడుదలైంది. చాలా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ విన్నాను. సొంతోషం అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read: అసలు ఎన్టీఆర్ కు ఏమైంది? అనారోగ్యంతో బాధపడుతున్నాడా?
సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది, ఇక ఈ చిత్రానికి సీక్వెల్ వచ్చే ఛాన్స్ లేదు. ఒక మొండిపట్టుతో సీక్వెల్ చెయ్యాలని అనుకుంటే, కచ్చితంగా డైరెక్టర్ క్రిష్ హ్యాండిల్ చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా ‘హరి హర వీరమల్లు’ సెకండ్ హాఫ్ ని మాత్రం అభిమానులు జీవితాంతం మర్చిపోలేరు. డబ్బింగ్ సీరియల్స్ లో వచ్చే గ్రాఫిక్స్ స్థాయి ప్రమాణాలు కూడా పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ సినిమాకు పాటించకపోతే ఇక ఎందుకు సినిమాలు తీయడం చెప్పండి. ఈ చిత్రానికి 150 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేశామని నిర్మాత AM రత్నం చెప్పుకుంటూ వచ్చాడు. అసలు అంత డబ్బు ఎక్కడ కనిపించింది. ఇదంతా పెద్ద స్కాం లాగా ఉందే అని అభిమానులు మండిపడుతున్నారు.