Hari Hara Veera Mallu Controversy: టాక్ తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్(PAWAN KALYAN) సినిమాలకు రికార్డు వసూళ్లు నమోదు అవుతాయి. ఆయనకున్న ఫ్యాన్ బేస్ అలాంటిది. కానీ హరి హర వీరమల్లు పరిస్థితి చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. రెండో రోజే కూలబడిన ఈ చిత్రం అతి చిన్న చిత్రాల వసూళ్ల కంటే కూడా వెనకబడింది.
ఫస్ట్ షో నుండే హరి హర వీరమల్లు(HARI HARA VEERAMALLU) చిత్రానికి నెగిటివ్ రివ్యూలు పడ్డాయి. యూఎస్ లో ప్రీమియర్స్ చూసి సోషల్ మీడియాలో రివ్యూలు పోస్ట్ చేసే కొందరు క్రిటిక్స్ కి క్రెడిబిలిటీ ఉంది. వారి రివ్యూల ఆధారంగా సినిమా చూడాలా వద్దా? అని డిసైడ్ అయ్యే ప్రేక్షకుల సంఖ్య పెరిగిపోయింది. యూట్యూబ్ టాప్ రివ్యూవర్స్ సైతం హరి హర వీరమల్లు చిత్రానికి దారుణమైన రేటింగ్స్ ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే సినిమాను రోస్ట్ చేశారు.
దారుణమైన విఎఫ్ఎక్స్, అర్థం పర్థం లేని ఎలివేషన్స్, ఫస్ట్ హాఫ్ కి సంబంధం లేని సెకండ్ హాఫ్, పవన్ కళ్యాణ్ లుక్ ప్రధానమైన లోపాలుగా విమర్శకులు వెల్లడించారు. ఒకచోట గడ్డంతో మరొక చోట గడ్డం లేకుండా పవన్ కనిపిస్తాడని, మేము ఏం తీసినా, ఎలా తీసినా పిచ్చి జనాలు చూస్తారన్నట్లు హరి హర వీరమల్లు మూవీ ఉందంటూ ఘాటైన విమర్శలు చేశారు. నెగిటివ్ రివ్యూలు పడినప్పటికీ డై హార్డ్ ఫ్యాన్స్ సినిమా చూశారు. ఫస్ట్ డే బుకింగ్స్ కారణంగా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.
Also Read: ‘సార్ మేడం’ ఫుల్ మూవీ రివ్యూ…
అయితే రెండో రోజు హరి హర వీరమల్లు కుప్పకూలిపోయింది. సాక్నిల్క్ మీడియా అంచనా ప్రకారం ఇండియాలో 2వ రోజు హరి హర వీరమల్లు రూ.8 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఫస్ట్ డే తో పోల్చితే వసూళ్లు 74% శాతం పడిపోయాయని సదరు మీడియా అంచనా వేసింది. మూడో రోజు కూడా హరి హర వీరమల్లు కోలుకున్న సూచనలు లేవు. డే 3 ఎర్లీ ట్రెండ్ ప్రకారం హరి హర వీరమల్లు ఇండియా వైడ్ రూ. 1.56 కోట్ల నెట్ వసూలు చేసింది.
హరి హర వీరమల్లు బుక్ మై షోలో దారుణమైన రికార్డు నమోదు చేసింది. 2025లో విడుదలైన కొన్ని చిన్న చిత్రాల కంటే తక్కువ బుకింగ్స్ హరి హర వీరమల్లు కి నడిచాయి. డే 2 కేవలం 99 వేల టికెట్స్ మాత్రమే బుక్ అయ్యాయి. కొత్త నటులతో తెరకెక్కించిన కోర్ట్ మూవీ కంటే కూడా ఈ బుకింగ్స్ తక్కువ కావడం విశేషం. కోర్టు మూవీ 2వ రోజు 1.30 లక్షల బుకింగ్స్ నమోదు చేసింది. అలాగే 1.50 లక్షల బుకింగ్స్ తో మ్యాడ్ స్క్వేర్ సైతం హరి హర వీరమల్లు కంటే ముందు ఉంది. కన్నప్ప 1.27 లక్షల బుకింగ్స్ నమోదు చేసింది. ఈ లెక్కలు చూస్తుంటే కనీసం అభిమానులు అయినా హరి హర వీరమల్లు చిత్రం చూస్తున్నారా? అనే సందేహం కలుగుతుంది.