https://oktelugu.com/

Kakinada: రక్తాన్ని మార్చి ఎక్కించారు.. మహిళ ప్రాణాలు తీసేసారు.. ఏపీలో ఘోరం

రక్త నమూనాలు సేకరించి రక్తమార్పిడి చేయడం అన్నది ప్రధాన విధి. కానీ కాకినాడ జిజిహెచ్ లో మాత్రం ఇష్టారాజ్యంగా రక్తం ఎక్కించిఓ మహిళ మృతికి కారణమయ్యారు అక్కడి వైద్యులు.

Written By:
  • Dharma
  • , Updated On : November 28, 2024 / 10:32 AM IST

    Kakinada

    Follow us on

    Kakinada: వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. వైద్యం కోసం వచ్చిన మహిళను కాటికి పంపారు. ఓ పాజిటివ్ రక్తం బదులు ఏపీ పాజిటివ్ ను ఎక్కించి ఆమె ఆరోగ్యం క్షమించడానికి కారణమయ్యారు. వైద్యం వికటించడంతో ఆమె మృతి చెందింది. పైగా ఆమె ప్రాణానికి మూడు లక్షల రూపాయల రేటు కట్టారు. అది కూడా ప్రభుత్వం సమకూర్చిన నగదు కావడం విశేషం. ఏపీలో వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం వలమారు గ్రామానికి చెందిన భావన శిరీష కిడ్నీ రోగి. ఈనెల 14న అస్వస్థతకు గురికావడంతో కాకినాడ కిమ్స్ లో చేర్పించారు. ఆమెకు వెంటనే డయాలసిస్ చేయాలని కాకినాడ జి జి హెచ్ కు రిఫర్ చేశారు. దీంతో ఆమెను ఈ నెల 4న జిజిహెచ్ఎం5లో చేర్చారు. మంగళవారం ఆమెకు డయాలసిస్ చేశారు.అనంతరం రక్తం ఎక్కించారు. కొద్దిసేపటికి ఆమె బిగుసుకు పోవడంతో ఆమె తల్లి వైద్య సిబ్బందికి తెలిపింది.వెంటనే వైద్యులు అప్రమత్తమయ్యారు. రోగికి అవసరమైన ఓ పాజిటివ్ కాదని..ఏబీ పాజిటివ్ ఎక్కించామని గ్రహించారు.అయితే శిరీష ఆరోగ్యం క్షీణించి బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. అయితే విషయం తెలుసుకున్న ఆసుపత్రి వర్గాలు ఆమె తల్లిని సముదాయించి ప్రభుత్వపరంగా సమకూర్చిన మూడు లక్షల చెక్కును చేతిలో పెట్టారు.

    * ఓ పాజిటివ్ బదులు.. ఏబీ పాజిటివ్
    కిడ్నీ రోగిగా ఉన్న శిరీషకు రక్తం తక్కువగా ఉండడంతోఓ పాజిటివ్ గ్రూప్ రక్తం ఎక్కించాలని వైద్యులు సూచించారు.రక్త నమూనాలను రోగి బంధువులు జిజిహెచ్ బ్లడ్ బ్యాంకులో ఇచ్చారు. మంగళవారం సాయంత్రం విధుల్లో ఉన్న హౌస్ సర్జన్ బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం తీసుకొచ్చి ఆమెకి ఎక్కిస్తుండగా రోగి బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ పాజిటివ్ ఎక్కిస్తున్నారేంటి అని ప్రశ్నించారు. నాకే చెబుతావా అంటూ హౌస్ సర్జన్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. కొద్దిసేపటికి బాధితురాలు అస్వస్థతకు గురైంది. అక్కడకు కొద్దిగా చనిపోయింది.

    * కుటుంబ సభ్యుల ఆగ్రహం
    కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిరీష చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అప్పటికైనా చెబుతూనే ఉన్నా నిర్లక్ష్యంగా మాట్లాడారని.. దీనిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటన దుమారానికి దారి తీయడంతో మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆరా తీశారు. విచారణకు ఆదేశించారు.