https://oktelugu.com/

Heroes : తెలుగులో మీడియం రేంజ్ హీరోలకు అవకాశాలు లేకుండా చేస్తున్న మలయాళం స్టార్ హీరో…అసలు మ్యాటరెంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మార్కెట్ ని క్రియేట్ చేసుకోవాలని పర భాష హీరోలు ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏంటి అంటే తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ అయితే తెలుగు దర్శకులు వాళ్ళతో సినిమాలు చేస్తారు.

Written By:
  • Gopi
  • , Updated On : November 28, 2024 / 10:41 AM IST

    Heroes

    Follow us on

    Heroes : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మార్కెట్ ని క్రియేట్ చేసుకోవాలని పర భాష హీరోలు ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏంటి అంటే తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ అయితే తెలుగు దర్శకులు వాళ్ళతో సినిమాలు చేస్తారు. తద్వారా వాళ్ళు ఇండియాలో ఫేమస్ అవ్వచ్చు అనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు ఒక స్ట్రాటజీని మెయింటైన్ చేస్తున్నారు…

    ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. కానీ మన స్టార్ హీరోలు తక్కువ సంఖ్యలో ఉండడంతో అందరికీ వాళ్ళతో సినిమాలు చేసే అవకాశం లేకపోవడంతో మన దర్శకులు ఇతర భాషల హీరోలతో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. నిజానికి ఇప్పుడున్న దర్శకులు మన మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేయొచ్చు. కానీ మనవాళ్లను కాదని బయటి హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ లను సాధిస్తున్నారు. ముఖ్యంగా వెంకీ అట్లూరి లాంటి దర్శకుడు అయితే వరుసగా ధనుష్, దుల్కర్ సల్మాన్ తో సినిమాలను చేసి తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇక ఆయన చేసిన సినిమాలు కూడా మంచి విజయాలను సాధించడంతో ఆ హీరోలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది. మరి దీని వల్ల మనకి తెలుగులో ఉన్న మీడియం రేంజ్ హీరోలు కొంతవరకు అవకాశాలను కోల్పోతున్నారు అంటూ వాళ్ళు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి దుల్కర్ సల్మాన్ ధనుష్ లాంటి హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. నాని, నితిన్, నిఖిల్ లాంటి హీరోలు మంచి సక్సెస్ లను సాధిస్తూ ఇండస్ట్రీలో తమకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్నారు.

    మరి వీళ్ళతో సినిమాలు చేయొచ్చు కదా మన దర్శకులు ఎందుకు ఇతర భాషల హీరోలను ప్రిఫర్ చేస్తున్నారనే విషయంలోనే ఇప్పుడు చాలా చార్చలైతే జరుగుతున్నాయి. ఇక ఆ హీరోల వల్ల మన మీడియం రేంజ్ హీరోలకు సరైన సక్సెస్ లు రాకపోవడమే కాకుండా అవకాశాలు కూడా దక్కడం లేదని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ఇక ఇదిలా ఉంటే మరి కొంతమంది దర్శకులు మాత్రం వాళ్ళు చెప్పే కథలను మన హీరోలు యాక్సెప్ట్ చేయడం లేదట దానివల్లే పరభాష హీరోలను తీసుకొచ్చి వాళ్ల చేత ఆ క్యారెక్టర్ లను చేయిస్తున్నాం ఇందులో మా తప్పు ఏముంది అంటూ దర్శకులు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు కొంతవరకు కొన్ని కథలను యాక్సెప్ట్ చేసే అవకాశం అయితే లేదు. వాళ్ళ స్టార్ ఇమేజ్ ని బేస్ చేసుకొని సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.

    కాబట్టి ఈ విషయంలో దర్శకులను కూడా మనం తప్పుబట్టడానికి వీల్లేదు. ముఖ్యంగా హీరోలు, దర్శకులు ఒక మ్యూచువల్ అండర్ స్టాండింగ్ మీద సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళితే ఇటు వీళ్ళకి, అటు వాళ్లకి ఇద్దరికీ సరైన గుర్తింపు రావడమే కాకుండా సక్సెస్ లు కూడా పెరుగుతూ ఉంటాయని ట్రేడ్ పండితులు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…