Johnny Master : నేషనల్ లెవెల్ లో గుర్తింపు పొంది, నేషనల్ అవార్డు ని గెలుచుకునే స్థాయిలో తన ప్రతిభని కొరియోగ్రాఫర్ గా చాటుకున్న జానీ మాస్టర్, ఈ ఏడాది లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి, మళ్ళీ బెయిల్ మీద బయటకి విడుదలైన సంగతి తెలిసిందే. కొంతకాలం విశ్రాంతి తీసుకున్న ఆయన, ఇప్పుడు మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. అంతా సాఫీగా సాగిపోతుంది, మళ్ళీ రెగ్యులర్ లైఫ్ లోకి వచ్చేసాను అని అనుకునేలోపే, జానీ మాస్టర్ కి ఊహించని షాక్ తగిలింది. లైంగిక వేధింపుల కేసు ని దర్యాప్తు చేస్తున్న పోలీసులు, మరో ఛార్జి షీట్ జానీ మాస్టర్ పై నేడు ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. ఆ ఛార్జ్ షీట్ లో కంప్లైంట్ ఇచ్చిన లేడీ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగిక దాడి జరిపాడని నిర్ధారించినట్లు తెలుస్తుంది. ఈవెంట్స్ పేరుతో ఆ యువతి ని పలు ప్రాంతాలకు తీసుకెళ్లిన జానీ మాస్టర్, అక్కడే ఆ అమ్మాయిపై లైంగిక దాడులు జరిపినట్టు పోలీసులు తేల్చేసారు.
దీంతో జానీ మాస్టర్ మళ్ళీ అరెస్ట్ కాబోతున్నాడా? అనే వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నాయి. అయితే సెక్షన్ 167 చట్టం ప్రకారం, ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం వల్ల బెయిల్ రద్దు అవ్వద్దని, ఇరువైపుల వాదనలు విన్న తర్వాత కోర్టు మాత్రమే నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తుంది. ప్రస్తుతానికి జానీ మాస్టర్ రిలాక్స్ గానే ఉండొచ్చు, కానీ ఏదైనా బలమైన ఆధారం దొరికితే మాత్రమే ఆయన మళ్ళీ రిస్క్ లో పడినట్టే. జానీ మాస్టర్ ఏ తప్పు చేయలేదని నమ్మే వాళ్ళు ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు. అందుకే ఆయనకీ అవకాశాలు వస్తున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం బుచ్చి బాబు తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కొన్ని పాటలకు జానీ మాస్టర్ కి కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చాడు రామ్ చరణ్.
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ మూవీ లోని ‘డోప్’ సాంగ్ కి కూడా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసాడు. రీసెంట్ గానే ఈ పాటని మూవీ టీం విడుదల చేయగా, ఆ పాటకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా జానీ మాస్టర్ రామ్ చరణ్ తో వేయించిన డ్యాన్స్ స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి.ఇకపోతే నేడు జానీ మాస్టర్ సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ని , అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు తన సతీమణి తో కలిసి కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. శ్రీతేజ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకునే వరకు, తనతో పాటు, తన డ్యాన్సర్ యూనియన్ లో కొరియోగ్రాఫర్స్ తో కూడా సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా జానీ మాస్టర్ మీడియా కి చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.