Whatsapp: వాట్సాప్ మన దైనందిన జీవితంలో ఓ అత్యవసర వస్తువు మాదిరిగా తయారైంది. మన స్తేహితులకూ, బంధువులకూ, ఆఫీస్ పనులకూ వాట్సాప్ వినియోగం అనివార్యంగా మారిపోయింది. మెసేజులు, ఫొటోలు, వీడియోలను సెకెండ్లలో షేర్ చేసేందుకు ఈ మెసేజింగ్ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మంది వాట్సాప్ వినియోగదారులు ఉన్నారంటే.. దాని వాడకం ఏ రేంజ్ లో ఉందో ఇట్టే అర్థం అవుతుంది. ఒక్క మన భారత దేశంలోనే దాదాపు 54 కోట్ల మంది ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే 2025 ప్రారంభంలో రష్యా ప్రభుత్వం వాట్సాప్‌ను బ్యాన్ చేస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అక్కడి సెనెటర్ ఆర్ట్‌యోమ్ షేయికిన్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. తమ దేశంలో యాప్ వినియోగంలో ఉండాలంటే, అక్కడి నియమ నిబంధనలను పాటించాలని, లేదంటే యాప్‌ను బ్యాన్ చేస్తామని ఓ ఇంటర్వ్యూలో సెనెటర్ షేయికిన్ హెచ్చరించారు. యాప్ యూజర్ల డేటాను షేర్ చేయాలని ప్రభుత్వం కోరగా వాట్సాప్ మాతృసంస్థ అంగీకరించలేదని తెలుస్తోంది.
దీంతో వాట్సాప్‌ను నిషేధించే దిశగా రష్యా ప్రభుత్వం నిర్ణయాత్మక అడుగు వేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చర్య 2025లో అమలులోకి వచ్చే అవకాశం ఉంది. రష్యన్ భద్రతా సేవలతో వినియోగదారు డేటాను పంచుకోవడానికి నిరాకరించడమే అది చేసిన తప్పిదం. రష్యా చట్టాలను పాటించడం లేదా మార్కెట్ నుండి నిష్క్రమించడం పూర్తిగా వాట్సాప్ మేనేజ్‌మెంట్‌పై ఆధారపడి ఉంటుందని రష్యా సెనేటర్ ఆర్టియోమ్ షేకిన్-స్టేట్ డూమా అధికారి ఒలేగ్ మాట్వెచెవ్ వ్యాఖ్యానించారు. విదేశీ కంపెనీలు తప్పనిసరిగా రష్యన్ చట్టాలకు లోబడి ఉండాలి లేదా దేశంలో కార్యాచరణ అసంభవాన్ని ఎదుర్కోవాలని ఆయన నొక్కి చెప్పారు.
వాట్సాప్ మాతృ సంస్థ అయిన మెటా రష్యాలో 2022 నుండి దాని ఇతర ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్‌లపై నిషేధాన్ని ఎదుర్కొంటోంది. ఈ తాజా హెచ్చరిక వాట్సాప్ రెగ్యులేటరీ డిమాండ్‌లను నెరవేర్చడంలో విఫలమైతే అదే పరిస్థితి దీనికి కూడా వస్తుంది. ప్రస్తుతం రష్యాలో ప్రస్తుతం 6 కోట్ల మంది వాట్సాప్ యూజర్లు ఉన్నారు.
గత ఏడాది అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనలు అమలులోకి తెచ్చింది. అప్పటి నుంచి వాట్సాప్ ఫేక్ అకౌంట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. మొత్తం 75.38 లక్షల అకౌంట్లను బ్యాన్ చేశారు. ఇది నిరంతరం జరుగుతోంది. ఇండియాలో కోట్ల మంది వాడుతున్న వాట్సాప్‌లో అప్పుడప్పుడూ ఫేక్ గ్రూపులు క్రియేట్ అవుతున్నాయి. అవి నెటిజన్లకు మనీ ఆశ చూపించి, వారిని బెట్టింగ్ ఉచ్చులో దింపి.. కోట్లు కొట్టేస్తున్నాయి. ఇలాంటి అక్రమాలు ఎక్కువగా చైనా నుంచి జరుగుతున్నాయి… వీటిపై కేంద్రం నిఘా పెట్టింది. వాట్సాప్ కూడా ఇలాంటి వాటిని అడ్డుకుంటూ.. ఎప్పటికప్పుడు.. బెటర్‌మెంట్ కోసం ప్రయత్నిస్తోంది.