https://oktelugu.com/

Guntur Karam re-release : గ్రాండ్ గా రీ రిలీజ్ కాబోతున్న మహేష్ బాబు ‘గుంటూరు కారం’..అడ్వాన్స్ బుకింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయంటే!

ఈ సినిమా, బాక్స్ ఆఫీస్ వద్ద మిస్ ఫైర్ గా నిల్చింది. అయినప్పటికీ సంక్రాంతి సెలవులను ఈ చిత్రం పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుంది. మహేష్ స్టామినా కి తగ్గట్టుగా వంద కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టి, బయ్యర్స్ కి పలు ప్రాంతాల్లో భారీ నష్టాలను మిగల్చకుండా చేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 25, 2024 / 09:20 PM IST

    Guntur Karam re-release

    Follow us on

    Guntur Karam re-release : ఈ ఏడాది సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూడవ సినిమా కావడంతో, ఈ చిత్రంపై షూటింగ్ దశ నుండే అంచనాలు తారా స్థాయిలో ఉండేవి. ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేకపోవడంతో మొదటి ఆట నుండే డిజాస్టర్ ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. ఫలితంగా సునామి లాంటి వసూళ్లను రాబడుతుంది అనుకున్న ఈ సినిమా, బాక్స్ ఆఫీస్ వద్ద మిస్ ఫైర్ గా నిల్చింది. అయినప్పటికీ సంక్రాంతి సెలవులను ఈ చిత్రం పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుంది. మహేష్ స్టామినా కి తగ్గట్టుగా వంద కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టి, బయ్యర్స్ కి పలు ప్రాంతాల్లో భారీ నష్టాలను మిగల్చకుండా చేసింది.

    ఉదాహరణకు కోస్తాంధ్ర ప్రాంతంలో తక్కువ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగడం వల్ల, ఎక్కువ నష్టాలు తప్పింది. ఈ ప్రాంతంలో పర్వాలేదు అని అనిపించే విధంగా ఆడింది. కానీ నైజాం, సీడెడ్, ఓవర్సీస్, కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతాల్లో మాత్రం బయ్యర్స్ కి కోలుకోలేని దెబ్బ కొట్టింది. కానీ ఈ సినిమాకి ఓటీటీ మరియు టీవీ టెలికాస్ట్ లో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మనోళ్లకు అసలు ఏమైంది?, ఇంత మంచి సినిమాని అసలు ఎలా ఫ్లాప్ చేసారంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రీ రిలీజ్ చెయ్యబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కాసేపటి క్రితమే జరిగింది. మహేష్ బాబు అభిమానులకు ఎంతో ఇష్టమైన సుదర్శన్ థియేటర్ లో రెండు షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా, అవి నిమిషాల వ్యవధి లోనే హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి.

    ఆ తర్వాత అదే కంప్లెక్స్ లో ఉండే దేవి థియేటర్ లోని రాత్రి 9 గంటల ఆటకు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా, ఆ థియేటర్ కూడా నిమిషాల వ్యవధిలో టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పుడు సంధ్య 35 ఎంఎం థియేటర్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. ఇలా బుకింగ్స్ ప్రారంభించడం, అలా అమ్ముడుపోవడం, మళ్ళీ అదనపు షోస్ ని యాడ్ చేయడం. అలా మహేష్ బాబు అభిమానులు ఈ చిత్రాన్ని కూడా రీ రిలీజ్ లో సూపర్ హిట్ చేసేలా ఉన్నారు ఊపు చూస్తుంటే. మరో మూడేళ్ళ వరకు మహేష్ బాబు వెండితెర మీద కనిపించడు కాబట్టి, అభిమానులు తమ హీరోని వెండితెర పై మళ్ళీ చూసే ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు. వాస్తవానికి ముందుగా అతిథి చిత్రాన్ని రీ రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ అది కుదరకపోవడంతో ‘గుంటూరు కారం’ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు.