Single Movie Trailer: యూత్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోలలో ఒకరు శ్రీవిష్ణు(Sri Vishnu). మంచి టాలెంట్ ఉన్నప్పటికీ కేవలం ఒకటి రెండు హిట్లు మాత్రమే శ్రీవిష్ణు కి దక్కాయి. అత్యధిక శాతం సినిమాలు ప్రయోగాత్మకంగా మిగిలాయి. అందుకే ఎక్కువ శాతం ఆడియన్స్ కి ఆయన సినిమాలు రీచ్ కాలేకపోయాయి. కానీ ‘సామజవరగమనా’ చిత్రం మాత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత విడుదలైన ‘స్వాగ్’ చిత్రం మాత్రం కమర్షియల్ గా అనుకున్న రేంజ్ కి వెళ్లలేకపోయింది. దీంతో ప్రయోగాల జోలికి పోకుండా, తనకు బాగా కలిసొచ్చిన ఎంటర్టైన్మెంట్ జానర్ లోనే వెళ్లాలని ఫిక్స్ అయ్యాడు శ్రీవిష్ణు. అందులో భాగంగా ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సింగల్'(Single Movie) కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదలైంది.
Also Read: అల్లు అర్జున్, చిరంజీవి మధ్య ఆసక్తికరమైన పోరు..గెలిచేది ఎవరో!
గీతా ఆర్ట్స్ పతాకం పై అల్లు అరవింద్, బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాని మే9న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. అయితే ఈ థియేట్రికల్ ట్రైలర్ ని చూసిన తర్వాత శ్రీవిష్ణు కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ ని అందుకోబోతున్నాడని స్పష్టంగా అర్థం అవుతుంది. శ్రీవిష్ణు మార్క్ కామెడీ టైమింగ్ డైలాగ్స్ తో పాటు, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం లో హీరోయిన్స్ గా కేతిక శర్మ(Kethika Sharma), ఇవానా (Ivana) (లవ్ టుడే ఫేమ్) నటించారు. ట్రైలర్ ని చూసిన తర్వాత ఇది ఒక ట్రైయాంగులర్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. శ్రీవిష్ణు హీరోయిన్ కేతిక శర్మ ని లవ్ చేస్తే, మరో హీరోయిన్ ఇవానా శ్రీవిష్ణు ని లవ్ చేస్తుంది. వీళ్ళ ముగ్గురి మధ్య జరిగే సంఘటనలే ఈ సినిమాకు కథ. వెన్నెల కిషోర్ ఇందులో శ్రీవిష్ణు కి స్నేహితుడి క్యారక్టర్ లో కనిపించనున్నాడు.
ఈయన ట్రైలర్ లో చెప్పిన ఒక డైలాగ్ బాగా పేలింది. ‘ఒక మనిషి ఎంత రిచ్ అయినా
హచ్ అనే తుమ్ముతాడు,రిచ్ అని కాదు’ అంటూ వెన్నెల కిషోర్ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. అలాగే శ్రీవిష్ణు హీరోయిన్ తో పులిహోర కలిపే సమయంలో నేను పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు కూడా ‘P’ తోనే మొదలు అవుతుందట అని అంటాడు. అప్పుడు హీరోయిన్ పార్వతి రెండు కాఫీ తీసుకొని రా అంటుంది. ఇలా ట్రైలర్ మొత్తం ఫన్నీ గా సాగిపోయింది. చూస్తుంటే శ్రీవిష్ణు మళ్ళీ భారీ హిట్ కొట్టేలాగానే ఉన్నాడు. పైగా గీత ఆర్ట్స్ లో తెరకెక్కిన సినిమా కాబట్టి, కనీస స్థాయిలో అయినా సినిమా ఉంటుందని ఆశిస్తున్నారు. రీసెంట్ గానే ‘తండేల్’ చిత్రం తో భారీ హిట్ ని అందుకొని మంచి ఊపు మీదున్న గీత ఆర్ట్స్, ఈ సినిమాతో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంటుందో లేదో చూడాలి.