Jabardasth Vinod: జబర్దస్త్ లేడీ గెటప్ ఫేమ్ వినోద్ తండ్రయ్యాడు. పండంటి బిడ్డ పుట్టడంతో ఎంతో సంతోషపడిపోతున్నాడు. తనను తేడా అన్న వారికి సరైన సమాధానమే చెప్పాడు. మీ వాడు లేడీ గెటప్ వేసుకుని అచ్చం ఆడదానిలాగే ఉన్నాడని పలువురు చేసిన కామెంట్లకు సమాధానం చెప్పినట్లు అయింది. తన ఇంట్లో వారిని సూటిపోటి మాటలతో దెప్పిపొడిచిన వారి నోళ్లకు తాళం వేశాడు. తనకు మగతనం ఉందని నిరూపించుకున్నాడు. విమర్శకులకు నోటికి తాళం వేశాడు.
జబర్దస్త్ షో ద్వారా ఎందరికో గుర్తింపు ఇచ్చిన కార్యక్రమం. దీంతో వినోద్ అచ్చం ఆడదానిలాగే ఉండటంతో అందరు టీం లీడర్లు అతడికి పాత్ర ఇచ్చి తమ టీంకు మంచి పేరు తెచ్చుకున్నారు. వినోదినిగా గుర్తింపు పొందిన వినోద్ కు ఆ మధ్యే పెళ్లయింది. దీంతో అతడు ఓ బిడ్డకు తండ్రి కావడంతో అతడి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ప్రఖ్యాతి గాంచిన జబర్దస్త్ షో లో ఎందరో కళాకారులకు అవకాశం ఇవ్వగా కొందరు వినియోగించుకుని తమ స్థానం పదిలం చేసుకోగా కొందరు మాత్రం బయటకు వెళ్లి వేరే చానళ్లలో కామెడీ షోలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Also Read: Sarkaru Vaari Paata on Amazon: ప్రైమ్ లో సర్కారు వారి పాట… అయితే మహేష్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్!
చమ్మక్ చంద్ర నుంచి దాదాపు అందరు టీం లీడర్లు వినోద్ తో స్కిట్ లు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లేడీ గెటప్ వేస్తే ఆడదో మగాడో అర్థం కాని పరిస్థితి. ఇంకా శాంతి స్వరూప్, మోహన్, హరి లాంటి వారున్నా వినోద్ స్థానం ప్రత్యేకం. దీంతో జబర్దస్త్ షో లో వినోద్ కు గుర్తింపుతో పాటు స్థానం కూడా దక్కడం విశేషం. మొత్తానికి వినోద్ కలల పంట పండింది. అతడి ఆశయం నెరవేరింది. తన కెరీర్ ను కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
వినోద్ తన అత్త కూతురు విజయలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు తల్లి లేకపోవడంతో ఢీ షోలో సుమ ఆమెకు సీమంతం జరిపించింది. లాక్ డౌన్ సమయంలో వీరి వివాహం జరిగింది. దీంతో నెటిజన్లు వినోద్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. వినోద్ కు బిడ్డ పుట్టడంపై సామాజిక మాధ్యమాల్లో వినోద్ పోస్టు చేసిన అతడి బిడ్డ ఫొటో వైరల్ అవుతోంది. మొత్తానికి వినోద్ కు అటు ప్రశంసలు ఇటు ఆనందం రెట్టింపు అవుతున్నాయి. జబర్దస్త్ షో నే తనకు ఇంతటి గుర్తింపు తీసుకొచ్చిందని కన్నీటి పర్యంతమయ్యాడు.
Also Read:NTR Son Jayakrishna: ఎన్టీఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ ఫస్ట్ టైం బయటకు.. ఎలా ఉన్నాడో తెలుసా?