KCR: కేసీఆర్ ఫ్రస్టేషన్ కు కారణమెంటో తేల్చిచెప్పిన రఘనందన్..!

హుజూరాబాద్ ఎన్నికలు ముగిసినప్పటికీ టీఆర్ఎస్, బీజేపీ వార్ కొనసాగుతూనే ఉంది. ఈటల రాజేందర్ గెలుపుతో బీజేపీలో కొత్త జోష్ నెలకొనగా టీఆర్ఎస్ లో మాత్రం నైరాశ్యం నెలకొంది. హుజూరాబాద్ సీటును కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ ఎన్ని ఎత్తులు వేసిన చివరికీ ఈటల రాజేందరే హుజూరాబాద్ బాద్షాగా నిలిచారు. దీంతో సీఎం KCR లో ఫ్రస్టేషన్ మొదలైందని బీజేపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. ఇందుకు సీఎం కేసీఆర్ నిన్న సాయంత్రం పెట్టిన ప్రెస్ మీటే నిదర్శమని ఎద్దేవా చేస్తున్నారు. […]

Written By: NARESH, Updated On : November 8, 2021 4:52 pm
Follow us on

హుజూరాబాద్ ఎన్నికలు ముగిసినప్పటికీ టీఆర్ఎస్, బీజేపీ వార్ కొనసాగుతూనే ఉంది. ఈటల రాజేందర్ గెలుపుతో బీజేపీలో కొత్త జోష్ నెలకొనగా టీఆర్ఎస్ లో మాత్రం నైరాశ్యం నెలకొంది. హుజూరాబాద్ సీటును కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ ఎన్ని ఎత్తులు వేసిన చివరికీ ఈటల రాజేందరే హుజూరాబాద్ బాద్షాగా నిలిచారు. దీంతో సీఎం KCR లో ఫ్రస్టేషన్ మొదలైందని బీజేపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. ఇందుకు సీఎం కేసీఆర్ నిన్న సాయంత్రం పెట్టిన ప్రెస్ మీటే నిదర్శమని ఎద్దేవా చేస్తున్నారు.

సీఎం KCR నిన్న సాయంత్రం గంటకు పైగా ప్రెస్ మీట్ పెట్టి మరీ బీజేపీ నేతలను ఏకీపారేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు. బండి సంజయ్ చాలా రోజుల నుంచి తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. తన స్థాయికి తగిన నేత కాదని వదిలేశానన్న కేసీఆర్ ఇకపై సహించేది లేదని మండిపడ్డారు. ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగుతాయని ఇన్నిరోజులు వదిలేశానని కానీ ఇకపై అలాంటి ఆటలు సాగవంటూ హెచ్చరికలు జారీ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఈ దేశానికి చేసిన మంచి పని ఒక్కటి కూడా లేదని మండిపడ్డారు. పెట్రోల్, డిజీల్ ధరలను పెంచుకుంటూ పోవడం వల్ల నిత్యావసర ధరలు పెరిగాయన్నారు. మేము పెట్రోల్, డిజీల్ పై తాము పన్నులను పెంచలేదన్నారు. కేంద్రమే కొండంత పెంచి ఐదురూపాయాలు తగ్గించిందని మండిపడ్డారు. కేంద్రం చేపట్టిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా తాను సైతం పోరాడుతానని కేసీఆర్ స్పష్టం చేశారు.

దీనిపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ తనదైన శైలిలో స్పందించారు. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఓటమిని పక్కదోవ పట్టించేందుకే బీజేపీపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు ఏడేళ్లలో ఎప్పుడు కోపం వచ్చినా.. ఆవేదన వచ్చినా అది ప్రజల అటెన్షన్ మార్చడం కోసమే బీజేపీని టార్గెట్ చేయడం కేసీఆర్ కు ఫ్యాషన్ గా మారిందని విమర్శించారు. కేసీఆర్ ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు ఆయనలోని ఫ్రస్టేషన్ ను తెలియజేస్తున్నాయంటూ రఘునందన్ కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణలో బీజేపీ బలపడుతుందని ఆపార్టీని ఎదుర్కోవడం కష్టమని ఇంటలిజెన్స్ కేసీఆర్ కు రిపోర్ట్ ఇచ్చాయని రఘునందన్ తెలిపారు. అందుకే ఆయనలో అసహనం పెరిగిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ వరి ధాన్యాన్ని కొనమని చెప్పలేదని.. కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే కొనమని చెప్పిదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించే పనులను మానుకోవాలని హితవు పలికారు.

కేంద్రం రాష్ట్రానికి ఏదైనా అన్యాయం చేస్తామని నిలదీయాలని సూచించారు. ఢిల్లీకి వెళ్లినపుడు రాష్ట్రానికి కావాల్సిన పనులు చేయించుకునే KCR తెలంగాణలో మాత్రం బీజేపీతో గొడవ పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. చట్టం ముందు అందరూ సమానమేనని ఎవరూ తప్పుచేసిన జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు. కేంద్రం పెంచిన ధరల్లో రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా రాలేదా? అంటూ ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలు పెట్రోల్, డిజీల్ ధరలు తగ్గించినట్లుగానే తెలంగాణలోనూ సీఎం కేసీఆర్ తగ్గించాలని రఘునందన్ డిమాండ్ చేశారు.