https://oktelugu.com/

Bandi sanjay : కేసీఆర్ కౌంటర్.. బండి సంజయ్ ఎన్కౌంటర్

Bandi sanjay : హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈటల విజయంతో దూకుడుమీదున్న బీజేపీ.. కేసీఆర్ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధించింది. ఉప ఎన్నికలో అధికార పార్టీ ఓటమితో.. అనివార్యంగా బయటకు వచ్చిన గులాబీ బాస్.. బీజేపీ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కౌంటర్ కు ప్రతిగా ఎంకౌంటర్ చేశారు బండి. ముఖ్యమంత్రి మీడియా సమావేశం పెట్టారంటే.. పెట్రో ధరల తగ్గింపుపై ప్రకటన […]

Written By:
  • Rocky
  • , Updated On : November 8, 2021 / 04:35 PM IST
    Follow us on

    Bandi sanjay : హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈటల విజయంతో దూకుడుమీదున్న బీజేపీ.. కేసీఆర్ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధించింది. ఉప ఎన్నికలో అధికార పార్టీ ఓటమితో.. అనివార్యంగా బయటకు వచ్చిన గులాబీ బాస్.. బీజేపీ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కౌంటర్ కు ప్రతిగా ఎంకౌంటర్ చేశారు బండి.

    ముఖ్యమంత్రి మీడియా సమావేశం పెట్టారంటే.. పెట్రో ధరల తగ్గింపుపై ప్రకటన చేస్తారని ఆశించామని అన్నారు. కానీ.. కేసీఆర్ విమర్శలకే పరిమితం అయ్యారని అన్నారు. ఈ నేపథ్యంలో.. మరిని ప్రశ్నలు సంధించారు బండి.

    కేంద్రం ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పిందన్న వ్యాఖ్యలపై సమాధానమిస్తూ.. 60 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొంటామని ఆగస్టు 31న కేంద్రం లేఖ రాసిందని చెప్పారు. కేంద్రం కొనుగోలు కేంద్రాలు తీసేస్తామని కొత్త చట్టంలో చెప్పిందా? అని ప్రశ్నించారు. ఎప్పుడో చేసిన రైతుచట్టాలపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న సీఎం.. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి యుద్ధం చేస్తానని, ఎక్కడ చేశారో చెప్పాలని ఎద్దేవా చేశారు.

    రాష్ట్రంలో.. 62 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని ప్రభుత్వం చెప్తోందని, ముందు దీనిపై సర్వే జరగాలని అన్నారు. ధాన్యం కొనుగోలుకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని కేసీఆర్ అంటున్నారని, మళ్లీ కేంద్రం కొనట్లేదని మీరే అంటారని, ఇందులో ఏది సరైనదో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

    పెట్రోల్ ధరలపైనా గులాబీ సర్కారును సంజయ్ ప్రశ్నించారు. లీటర్‌ పెట్రోల్‌పై రూ.28 రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయని.. కేంద్రానికి వచ్చే రూ.27లోనూ తిరిగి రాష్ట్రానికి రూ.12 వస్తున్నాయని చెప్పారు. దేశంలో వ్యాట్ అత్యధికంగా విధించే రాష్ట్రాల్లో.. తెలంగాణ రెండో స్థానంలో ఉందని అన్నారు. దేశంలో.. 24 రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించినప్పుడు.. తెలంగాణ సర్కారు ఎందుకు తగ్గించదని ప్రశ్నించారు.