Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 5 Telugu: పదో వారంలో నామినేషన్లో ఉంది వీళ్ళే

Bigg Boss 5 Telugu: పదో వారంలో నామినేషన్లో ఉంది వీళ్ళే

Bigg Boss 5 Telugu: సోమవారం వచ్చిందంటే చాలు రచ్చ రంబోలా అవుతుంది. హౌస్ లో నామినేషన్ల ప్రక్రియ చినిగి చాటవుతోంది. గొడవలు, కొట్లాటలు, ఆగ్రహ జ్వాలలు.. ఇలా కొట్టుకోవడం ఒకటే తక్కువ అన్నట్టుగా సాగుతోంది. హౌస్ లో ఎమోషన్స్ పీక్ స్టేజ్ కి చేరుకుంటుండగా.. ప్రేక్షకులకు మాత్రం కావాల్సినంత మజా పంచుతోంది.

బిగ్ బాస్ లో అన్నింటికంటే పెద్ద టాస్క్ నామినేషన్స్. బాగా ఆడినా, ఆడకపోయినా.. నవ్వించినా.. నవ్వించకపోయినా.. ఏ చిన్న తప్పు చేసినా.. చేయకున్నా సరే కంటెస్టెంట్లు కారణాలు చూపి నామినేట్ చేయాల్సి ఉంటుంది. హౌస్ లోని అందరూ దీన్ని భరించాల్సిందే. ఎప్పుడో ఒకప్పుడు నామినేట్ కావాల్సిందే. ప్రతి సోమవారం దీన్ని చేపడతారు. అదే రోజు హౌస్ రసాభాసగా సాగుతుంది.

ఇప్పటికే బిగ్ బాస్ నుండి తొమ్మిది మంది కంటెస్టెంట్లు (సరయు, ఉమాదేవి, లహరి షారి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేతా వర్మ, ప్రియా, లోబో, విశ్వ ) ఎలిమినేట్ అయ్యారు. మరి పదో వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ నిన్ననే అయిపోయిందని తెలుస్తుంది. అయితే తాజా గా జరుగుతున్న లీకుల ప్రక్రియలో పదో వారానికి గాను నామినేట్ అయిన హౌస్ మేట్స్ ఎవరో ముందుగానే తెలిసిపోయింది. అలా పదో వారానికి ఇంటి నుండి బయటకి వెళ్ళడానికి గానూ రవి, సన్నీ, మానస్, కాజల్, సిరి నామినేట్ అయ్యినట్లు తెలుస్తుంది. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం తెలుసుకోవాలంటే వచ్చే ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే.

NVN Ravali
NVN Ravali
Ravali is a Entertainment Content Writer, She Writes Articles on Entertainment and TV Shows.

Most Popular

Team India Test Cricket: ఈ గాయపడ్డ సింహాలను నమ్ముకుంటే.. లంకా దహనం అయినట్టే..

Team India Test Cricket: వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. అలాగని రెడ్ బార్ ఫార్మాట్లో అదరగొట్టడం లేదు.. కాకపోతే వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్...

Jagan Mohan Reddy: కాక్రోచ్ సరే.. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ మాటేంటి జగన్?!

Jagan Mohan Reddy: దేశంలోనే నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం పెద్ద వివాదమే రేపింది. చివరకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా విద్యార్థి లోకం పోరాటం చేసింది. జనతా కాక్రోచ్...

YSR Congress: పార్టీకి డ్యామేజ్.. వైసీపీ సీనియర్ల ఆవేదన అదే!

YSR Congress: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎటు వెళ్తుందో తెలియడం లేదు. ఆ పార్టీ సీనియర్లలో ఆందోళన అదే. ప్రజా పోరాటాలు చేయడం లేదు. ప్రజా ఆందోళనలు నిర్వహించడం లేదు.. జాతీయస్థాయిలో జరుగుతున్న...

OnePlus N6x: ట్రావెల్ చేసేవారికి సూపర్ ఫోన్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే..

OnePlus N6x: భారత్ లో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ అందుబాటులోకి వస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీ కొత్త ఫోన్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ రిలీజ్...

EPFO News: 20 రోజుల్లోపై డబ్బు జమకాకపోతే 12 శాతం వడ్డీ..

EPFO News: ప్రభుత్వేతర, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిథి చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ప్రతి నెల...
Oktelugu Epaper
Exit mobile version