https://oktelugu.com/

IND vs ENG 4th Test : నైతికాలు, అనైతికాలు ఉండవ్.. ఇంగ్లాండ్ కెప్టెన్ కు ఎవరైనా చెప్పండయ్యా..

ఈ మాత్రం క్రీడా స్ఫూర్తి ఇంగ్లాండ్ కెప్టెన్ లో లోపించింది. అందుకే అతడి నాలుక ఏదేదో మాట్లాడుతోంది. పాపం వరుస ఓటములతో ఇంగ్లాండ్ కెప్టెన్ కు ఏమైనా అయ్యిందా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 26, 2024 / 04:46 PM IST
    Follow us on

    IND vs ENG 4th Test : “భారత గడ్డపై టెస్ట్ సిరీస్ కోల్పోయినప్పటికీ.. మా జట్టు ఆటతీరు బాగుంది. ఆటగాళ్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. రాంచి వేదికగా గొప్ప మ్యాచ్ జరిగింది. ఈ సిరీస్ కోల్పోయినప్పటికీ నైతికంగా మాదే విజయం. ఈ మ్యాచ్ జరిగిన విధానాన్ని చూస్తే గెలుపు క్రెడిట్ భారత జట్టుకు ఇవ్వకూడదు. మా జట్టులో అనుభవం లేని స్పిన్నర్లు ఉన్నారు. కానీ వారు అసాధారణ ప్రదర్శన కనబరిచారు.” ఇవీ నాలుగో టెస్టులో భారత్ ఘనవిజయం సాధించిన తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben stokes) చేసిన వ్యాఖ్యలు. చదువుతుంటే నవ్వొస్తోంది కదూ.. ఇంగ్లాండ్ కెప్టెన్ మీద జాలి కలుగుతుంది కదూ.. అతడికి ఎవరైనా చెబితే బాగుండు అనిపిస్తోంది కదూ..

    వాస్తవానికి ఓటమి అనేది గెలుపునకు నాంది పలకాలి. కానీ ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ కు వరుస ఓటములు ఎదురైతున్నప్పటికీ గెలవాలి అనే కసి కలుగుతున్నట్టు లేదు. పైగా భారత జట్టుపై నిందలు వేస్తుండడం అతడి వ్యక్తిత్వాన్ని సూచిస్తోంది. రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ భారీ విజయం సాధించిన అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలోనూ బెన్ స్టోక్స్(Ben stokes) ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. పైగా తన కోచ్ బ్రెండన్ మెక్కులం(Brendon McCullum) తో కలసి ఎంపైర్ కాలింగ్ నిర్ణయాలపై సమీక్షించాడు. దీనిపై విమర్శలు చెలరేగినప్పటికీ ఇంగ్లాండ్ కెప్టెన్ తనను తాను సమర్ధించుకున్నాడు. పైగా మొదటి టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించిన అనంతరం బజ్ బాల్ పై బెన్ స్టోక్స్(Ben stokes) ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో అందరికీ తెలుసు.

    రాంచీ టెస్ట్ లో రెండో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా యువ సంచలనం జైస్వాల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అప్పటికి మ్యాచ్ 20 ఓవర్ కు చేరుకుంది. ఇంగ్లాండ్ బౌలర్ రాబిన్ సన్ ఆ ఓవర్ వేస్తున్నాడు. రాబిన్ సన్ వేసిన చివరి బంతిని డిఫెన్స్ ఆడాలని జైస్వాల్ భావించాడు. కానీ ఆ బంతి బ్యాట్ ఎడ్జ్ తాకి గాల్లోకి ఎగరగా ఇంగ్లాండ్ కీపర్ ఫోక్స్ డైవ్ చేసి. అది ఔటా? కాదా? అని చెప్పడానికి ఎంపైర్లు చాలా సమయం తీసుకున్నారు. రిప్లై లో యశస్వి బ్యాట్ ను తాకిన బంతి మైదానాన్ని కూడా తాకింది. తర్వాత ఆ బంతిని ఫోక్స్ చేతులతో అందుకున్నాడు. ఫోక్స్ గ్లవ్స్ ఆకుపచ్చగా ఉండటంతో మైదానంలో ఉన్న గడ్డి రంగుతో కలిసిపోయాయి. అయితే బంతి నేల పై తగలగానే ఫోక్స్ అందుకున్నాడని భావించి ఎంపైర్లు నాట్ అవుట్ గా ప్రకటించారు.. వాస్తవానికి బంతి నేలకు తగిలిందని ఇంగ్లాండ్ కెప్టెన్ కు తెలుసు. కీపర్ కు కూడా తెలుసు. కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పలేదు. కీలకమైన సమయంలో అనుకూలమైన నిర్ణయాలు రావాలని ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆకుపచ్చ రంగుల గ్లవ్స్ వాడుతున్నారని నెటిజన్లు ఆరోపించారు కూడా. ఇలాంటి ఆట తీరు ప్రదర్శించిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ అనైతికం గురించి ఎలా మాట్లాడుతాడో అతడికే తెలియాలి.

    ఇదే టెస్టులో శనివారం ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో రూట్ క్యాచ్ ను భారత కెప్టెన్ రోహిత్ శర్మ అందుకున్నాడు. ఎంపైర్లకు అప్పీలు చేశాడు. కానీ తనకు క్యాచ్ అందుకున్న తర్వాత అనుమానం కలిగి థర్డ్ ఎంపైర్ సలహా తీసుకోవాలని ఫీల్డ్ ఎంపైర్ కు సూచించాడు. ఆ తర్వాత ఫీల్డ్ ఎంపైర్ అలానే పాటించి రూట్ ను నాట్ అవుట్ గా ప్రకటించాడు. రోహిత్ శర్మ క్రీడా స్ఫూర్తిని అభినందించాడు.. ఈ చిన్న ఉదాహరణ చాలు భారత జట్టుకు గెలుపు క్రెడిట్ ఎందుకు ఇవ్వాలో చెప్పేందుకు.. ఈ మాత్రం క్రీడా స్ఫూర్తి ఇంగ్లాండ్ కెప్టెన్ లో లోపించింది. అందుకే అతడి నాలుక ఏదేదో మాట్లాడుతోంది. పాపం వరుస ఓటములతో ఇంగ్లాండ్ కెప్టెన్ కు ఏమైనా అయ్యిందా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.