IND vs ENG 4th Test : ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో రాంచీలో జరిగిన నాలుగో టెస్ట్ లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం ద్వారా మరో టెస్ట్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సిరీస్ దక్కించుకుంది. సిరీస్ తగ్గించుకోవడంతో జట్టులో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి ఈ మ్యాచ్లో కీలకమైన బుమ్రా, రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ లేకుండానే భారత్ విజయం సాధించడం పట్ల సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్ ధృవ్ జురెల్(Dhruv Jurel) తీరును మాజీ ఆటగాళ్ల నుంచి నెటిజన్ల వరకు అభినందిస్తున్నారు. నాలుగో టెస్టులో విజయం అనంతరం
ధృవ్ జురెల్(Dhruv Jurel) కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.
నాలుగో టెస్టులో విజయం సాధించిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరులతో మాట్లాడాడు. ” రాంచీ మైదానం చాలా విభిన్నమైనది. మొదటి రోజు ఇంగ్లాండ్ మాపై ఆధిక్యం ప్రదర్శించింది. రెండవ రోజు ఇంగ్లాండ్ జట్టును మేము కట్టడి చేసినప్పటికీ.. మా బ్యాటర్లు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బౌలర్లకు దాసోహం అయ్యారు. జట్టు తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు ఆపద్బాంధవుడు లాగా ధృవ్ జురెల్(Dhruv Jurel) వచ్చాడు. కులదీప్ యాదవ్, ఆకాష్ తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 90 పరుగుల వద్ద ఉన్నప్పుడు అవుట్ అయ్యాడు. 10 పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయినప్పటికీ అప్పటికే అతడు జట్టును సురక్షిత స్థానంలోకి చేర్చాడు.ధృవ్ జురెల్(Dhruv Jurel) ఆట తీరు నన్ను చాలా ఆకట్టుకుంది. అతడు కీలక ఇన్నింగ్స్ ఆడకుండా ఉండి ఉంటే భారత్ తీవ్ర ఇబ్బందుల్లో పడేది.. కోచ్ రాహుల్ కూడా యువకుల నుంచి ఇలాంటి ఆటనే ఆశిస్తాడు. వారు దేశవాళీ క్రికెట్లో ఆడిన తర్వాత ఆ అనుభవాన్ని జట్టు కోసం ఉపయోగిస్తే ఇలాంటి ఫలితాలు వస్తాయి. ధృవ్ జురెల్(Dhruv Jurel) రెండవ ఇన్నింగ్స్ లోనూ కీలక పాత్ర పోషించాడు. అతడు 39 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకంగా నిలిచాడు” అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.
కాగా మొదటి ఇన్నింగ్స్ లో 90, రెండవ ఇన్నింగ్స్ లో 39 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ధృవ్ జురెల్(Dhruv Jurel) కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. అతడు ఆడిన ఆట తీరు పట్ల సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ” నిన్ను చూస్తుంటే ఒకప్పటి ధోని గుర్తుకు వస్తున్నాడు. నీ సమయమనం చాలా బాగుంది. ఆటలో ఓర్పు అద్భుతంగా ఉంది. ఇలాంటి సమయంలోనే అద్భుతమైన ఇన్నింగ్స్ బయటపడతాయి. అలాంటివే జట్టును కష్ట కాలం నుంచి రక్షిస్తాయి” అని ధృవ్ జురెల్(Dhruv Jurel) ఆట ఉద్దేశించి సీనియర్లు కామెంట్లు చేస్తున్నారు. ధృవ్ జురెల్(Dhruv Jurel) కీలకమైన ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో ట్విట్టర్ ఎక్స్ లో అతని పేరు తెగ చక్కర్లు కొడుతోంది.