Prasanth Varma
Prasanth Varma : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు చాలా మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక వాళ్లను స్టార్ హీరోలుగా మార్చడంలో దర్శకులు సైతం అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఒక గొప్ప సినిమాను తీసే విధంగా ప్రణాళికలను రూపొందించుకుంటూ సినిమాలను చేస్తున్నారు… ఇలాంటి క్రమంలోనే యంగ్ డైరెక్టర్ గా వచ్చి మంచి మూవీస్ చేస్తూన్న దర్శకుడు ప్రశాంత్ వర్మ సైతం.. ఆయన గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ సినిమాలను చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన దర్శకులలో రాజమౌళి (Rajamouli) మొదటి స్థానంలో ఉంటాడు. ఇక అతని తర్వాత స్థానంలో మరికొంతమంది దర్శకులు ఉంటారు. ఇక అందులో ప్రశాంత వర్మ (Prashanth Varma) కూడా ఒకరు. ‘హనుమాన్ ‘ (Hanuman) సినిమాతో పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కించిన ఈ సినిమాతో విజువల్ వండర్ ని చూపించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకున్నాడు… ప్రస్తుతం ‘జై హనుమాన్’ అనే సినిమాని తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక దీంతో పాటుగా మోక్షజ్ఞ (Mokshagna) ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే మోక్షజ్ఞ కి ఇది మొదటి సినిమా కావడంతో ఎలాగైనా సరే ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రశాంత్ వర్మ ఇటు సినిమాలను చేసుకుంటూనే అటు సినిమాలకు కథలను అందిస్తూ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. నిజానికి ప్రశాంత్ వర్మ చాలా మంచి మేకర్…
మంచి సినిమాలను తీయడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. కానీ ఇటు సినిమాలను డైరెక్షన్ చేస్తూ, అటు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ మరో వైపు కొన్ని సినిమాలకి కథలను అందిస్తూ పలు బాధ్యతలను నిర్వర్తించడం వల్ల ఆయన డైరెక్షన్ చేసే సినిమా మీద పెద్దగా ఫోకస్ చేసే అవకాశాలైతే కనిపించడం లేదు.
ఒకవేళ అలాగే జరిగితే ఆయన ఇండస్ట్రీలో ఎక్కువ రోజులపాటు తన మనుగడను కొనసాగించలేక ఫేడ్ అవుట్ అయిపోయే ప్రమాదం కూడా రావచ్చు… అందుకే ఆయన సినిమా డైరెక్షన్ మీద మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేసుకుంటూ ముందుకు సాగితే మంచిది. అలా చేస్తే మాత్రం ప్రశాంత్ వర్మ టాప్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఆయన సినిమాకి 400 కోట్ల కలెక్షన్స్ రావడం అనేది మామూలు విషయం కాదు. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రశాంత్ వర్మ ఏం చేయబోతున్నాడు. జై హనుమాన్ సినిమాతో పాటుగా మోక్షజ్ఞ సినిమాని కూడా ఏకకాలంలో తీస్తాడా తద్వారా ఈ రెండు సినిమాలను సూపర్ సక్సెస్ గా నిలిపగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…ప్రస్తుతం చాలా మంది హీరోలు ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు…