NTR and Prashanth Neel: అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో ఎదురు చూసే కొన్ని సినిమాలు ఉంటాయి, వాటిల్లో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్(#NTRNeel) కాంబినేషన్ సినిమా ఒకటి. డిజాస్టర్స్ అందించే డైరెక్టర్ తోనే ‘దేవర'(Devara Movie) తీసి 400 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టిన హిస్టరీ ఎన్టీఆర్(Junior Ntr) సొంతం. అలాంటి హీరో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ప్రశాంత్ నీల్(Prasanth Neel) లాంటి డైరెక్టర్ తో సినిమా చేస్తే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత ఏడాది పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసారు. వాళ్ళ ఎదురు చూపులకు తెర దించుతూ రేపటి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఒక భారీ యాక్షన్ సన్నివేశం తో రేపు అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ ప్రారంభం అవుతుంది.
రేపు జరిగే షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనట్లేదని సమాచారం. ఈ షెడ్యూల్ మొదలైన రెండు మూడు రోజుల తర్వాత ఎన్టీఆర్ పాల్గొంటాడట. ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు అనేది ఇప్పటికీ ఇంకా ఖరారు కాలేదు. మలయాళం స్టార్ హీరో టోనీవో థామస్(Tonivo Thomas) ఇందులో ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడని కొద్దిరోజుల క్రితమే ఒక రూమర్ వచ్చింది. కానీ అది అధికారికంగా ఖరారు కాలేదు. కానీ హీరోయిన్ గా మాత్రం రుక్మిణి వాసంత్(Rukmini Vasanth) నటించబోతుందట. రెండేళ్ల పాటు మరో సినిమా షూటింగ్ లో పాల్గొనకుండా, కేవలం ఈ సినిమాకే డేట్స్ కేటాయిస్తానని ఆమె ఒప్పందం కూడా చేసుకుందట. రెండవ షెడ్యూల్ లో ఈమె పాల్గొనే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు సమాచారం. పుష్ప 2 నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్, నందమూరి ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఇదంతా పక్కన పెడితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రకటించిన కొత్తల్లో కోలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన కమల్ హాసన్ ని ఒక కీలక పాత్ర కోసం అడిగినట్టు వార్తలు వినిపించాయి. కమల్ హాసన్ ని కలిసిన విషయం వాస్తవమే కానీ, ఆయన ఇందులో నటించడానికి ఒప్పుకున్నాడా లేదా అనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఒకవేళ ఒప్పుకుంటే మాత్రం మూవీ లవర్స్ కి కనుల పండగే అని చెప్పొచ్చు. గత జనరేషన్ లో మహానటుడిగా పేరొందిన కమల్ హాసన్, ఈ జనరేషన్ లో మహానటుడిగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేస్తే పాన్ ఇండియా లెవెల్ లో బాక్స్ ఆఫీస్ వద్ద ఒక్క రికార్డు కూడా మిగలదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2 ‘ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఆగస్టు నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.