Hardik Pandya- Shubman Gill: న్యూజిలాండ్ తో నిర్ణయాత్మక మూడో టి20 భారత్ విజయం సాధించింది.. ఏకంగా 168 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. టి20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది.. అయితే ఈ మ్యాచ్ లో కూడా కెప్టెన్ హార్దిక్ పాండ్యా కొన్ని పొరపాట్లు చేశాడు.. కానీ ఒక మాస్టర్ స్ట్రోక్ కారణంగా ఆ పొరపాట్లు పనిచేయలేదు.. లేకుంటే ఫలితం మరో విధంగా ఉండేది.

కీలకమైన ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా తన బౌలర్లను పూర్తిస్థాయిలో వాడుకోలేదు. కొత్త బంతితో తన ఎటాక్ ప్రారంభించాడు.. తర్వాత అయినా మావికి అవకాశం ఇవ్వాల్సి ఉండేది.. కానీ అలా చేయలేదు. తన కోటా ఓవర్లు పూర్తి చేశాడు. కానీ అర్ష్ దీప్ సింగ్, మావి, మాలిక్ తమ కోటా పూర్తి చేయలేదు. అందుకని పాండ్యా బౌలింగ్ ను తప్పు పట్టలేం.. అతను నాలుగు వికెట్లు తీసుకున్నాడు కదా.. అని అనుకోవచ్చు. కానీ ఇలాంటి ఒత్తిడి మ్యాచ్ లోనే మావిని టెస్ట్ చేసి ఉంటే బాగుండేది.. ఇందులో ఒకవేళ మావి ప్రతిభ చూపితే బౌలింగ్ దళానికి మరో ఆకర్షణ చేరి ఉండేది.
సిరీస్ డిసైడర్ లో పాండ్యా చేసిన మరో పెద్ద పొరపాటు ఇషాన్ కిషన్ ను ఆడించడం… ఇటీవల కాలంలో ఏమాత్రం ఫామ్ లో లేకుండా క్రీజు లో వెళ్లడానికే తంటాలు పడుతున్న ఆటగాడు కిషన్. అలాంటి వాడి బదులు పృథ్వీ షా ను తీసుకోవాలని చాలామంది డిమాండ్ చేశారు.. కానీ వాటిని పాండ్యా పట్టించుకోలేదు. ఈ క్రమంలో కిషన్ కేవలం ఒక్క పరుగుకే అవుట్ అయ్యాడు. ఇతనితో పాటు ఫినిషర్ రోల్ లో ఇబ్బంది పడుతున్న దీపక్ హుడాకు కూడా విశ్రాంతి ఇవ్వాలని, అతడి స్థానంలో జితేశ్ శర్మను ఆడించాలని కూడా డిమాండ్లు వచ్చాయి.. కానీ పాండ్యా ఆ పని చేయలేదు.. వీళ్ళిద్దరూ ఈ మ్యాచ్లో చేసింది ఏమీ లేదు కూడా.

ఇక పాండ్యాకు ఈ మ్యాచ్లో అతిపెద్ద ఉపశమనం గిల్ మాస్టర్స్ స్ట్రోక్… అతడికి మద్దతుగా ఉన్నందుకు పాండ్యా నమ్మకాన్ని గిల్ నిలబెట్టాడు.. టి20 లో కూడా తాను మెరుగైన బ్యాటర్ అని సెంచరీ చేసి నిరూపించాడ గిల్. అద్భుతమైన ఆట తీరుతో భారత్ తరఫున టి20 లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు.. పాండ్యా ఇచ్చిన సూచన మేరకు గిల్ రెచ్చిపోయాడు.. అతడి వల్లే టీమిండియా భారీ స్కోరు సాధించిందనేది వాస్తవం. అంతే కాదు పాండ్యా చేసిన తప్పులు కూడా ఈ మాస్టర్ స్ట్రోక్ లో కనుమరుగైపోయాయి.. లేకుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది.