Homeఎంటర్టైన్మెంట్Ram Charan mythological movie: మైథాలాజికల్ సినిమాలో రామ్ చరణ్...చిరంజీవి కోరిక మేరకే ఆ పాత్ర...

Ram Charan mythological movie: మైథాలాజికల్ సినిమాలో రామ్ చరణ్…చిరంజీవి కోరిక మేరకే ఆ పాత్ర చేయబోతున్నాడా..?

Ram Charan mythological movie: మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. తెలుగు తెరమీద చెరగని ముద్ర వేసిన నటుడుగా తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ స్టార్ డమ్ ను సంపాదించుకున్న నటుడు కూడా చిరంజీవే కావడం విశేషం… ఇక ప్రస్తుతం ఆయన 70 సంవత్సరాల వయసులో కూడా హీరోగా రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. రీసెంట్ గా ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో 400 కోట్లకు పైన […]

Ram Charan mythological movie: మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. తెలుగు తెరమీద చెరగని ముద్ర వేసిన నటుడుగా తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ స్టార్ డమ్ ను సంపాదించుకున్న నటుడు కూడా చిరంజీవే కావడం విశేషం… ఇక ప్రస్తుతం ఆయన 70 సంవత్సరాల వయసులో కూడా హీరోగా రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. రీసెంట్ గా ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో 400 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు. ఇక తన నట వారసుడు అయిన రామ్ చరణ్ సైతం గ్లోబల్ స్టార్ గా అవతరించడమే కాకుండా పాన్ ఇండియాలో డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం విశేషం…ఇక రామ్ చరణ్ ఇప్పటివరకు చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్ కి తీసుకెళ్ళాయి. చిరంజీవి ఇప్పటివరకు మైథాలాజికల్ సినిమాల్లో ఎక్కువగా నటించలేదు.

ఒకటి రెండు క్యారెక్టర్లు పోషించినప్పటికి ఫుల్ లెంత్ క్యారెక్టర్లలో తను పెద్దగా నటించలేదు. కొన్ని పాత్రల్లో నటించిన కూడా అవి అతనికి గొప్ప గుర్తింపునైతే తీసుకురాలేదు. దాంతో రామ్ చరణ్ రాముడిగా నటిస్తే చూడాలని చిరంజీవి ఎప్పటినుంచో అనుకుంటున్నారట. ‘త్రిబుల్ ఆర్’ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించాడు.

చివర్లో కొద్దిసేపు ప్రతి ఒక్కరు రాముడి అవతారంలో కనిపించాడు అంటూ కామెంట్లైతే చేశారు. ఇక ఏది ఏమైనా కూడా ఫుల్ లెంత్ రాముడి పాత్రలో రామ్ చరణ్ ని చూడాలని చిరంజీవి అనుకుంటున్నారట. దానికి తగ్గట్టుగానే కొంతమంది దర్శకులు అతనితో రామాయణాన్ని తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి రామ్ చరణ్ సైతం రామాయణంలో నటించడానికి సిద్ధమవుతున్నాడట. ఇక బాలీవుడ్ లో ఇప్పటికే రన్బీర్ కపూర్ రాముడిగా రామాయణం సినిమా తెరకెక్కుతుంది.

భారీ బడ్జెట్ సినిమా ఈ రేంజ్ రికార్డులను క్రియేట్ చేస్తుంది అంటూ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ సైతం రామాయణం సినిమా చేస్తే ఆ సినిమా ఎలాంటి క్రేజ్ ను సంపాదించుకుంటుంది ప్రేక్షకుల్లో అటెన్షన్ క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

 

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper