
తనకు పదవి ఉన్న లేకున్నా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పని చేస్తానని మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త పీసీసీ కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పని చేయాలన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ కోసం కష్టపడుతున్నారని కొందరు ఆస్తులు అమ్ముకొని మరీ పని చేస్తున్నారని తెలిపారు.