https://oktelugu.com/

బూతు బాగోతాలు కాంట్రవర్సీ కామెంట్స్ ఇంకెన్నాళ్లు ?

జబర్దస్త్ అంటేనే బూతు బాగోతం. ఈ బాగోతంలోకి అడుగు పెట్టి తక్కువ టైంలోనే తనదైన నవ్వులతో ‘హైపర్ ఆది’గా బాగా ఫేమస్ అయ్యాడు యాదయ్య. సినిమాల్లోనూ నిలదొక్కుకొని లక్షల తీసుకొనే నటుడిగా కూడా ఎదిగాడు. అంత ఎదిగిన తర్వాత కూడా, జబర్దస్త్ తో పాటు మిగిలిన కొన్ని బూతు డ్రామాలలో కూడా నటిస్తూ చక్కగా న నోటికొచ్చినట్టు కామెంట్స్ చేసి, అడ్డమైన మాటలు మాట్లాడి చివరకు వివాదాలలో చిక్కుకుంటూ వివరణ ఇచ్చుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నది ఆది. […]

Written By: , Updated On : June 17, 2021 / 04:28 PM IST
Follow us on

జబర్దస్త్ అంటేనే బూతు బాగోతం. ఈ బాగోతంలోకి అడుగు పెట్టి తక్కువ టైంలోనే తనదైన నవ్వులతో ‘హైపర్ ఆది’గా బాగా ఫేమస్ అయ్యాడు యాదయ్య. సినిమాల్లోనూ నిలదొక్కుకొని లక్షల తీసుకొనే నటుడిగా కూడా ఎదిగాడు. అంత ఎదిగిన తర్వాత కూడా, జబర్దస్త్ తో పాటు మిగిలిన కొన్ని బూతు డ్రామాలలో కూడా నటిస్తూ చక్కగా న నోటికొచ్చినట్టు కామెంట్స్ చేసి, అడ్డమైన మాటలు మాట్లాడి చివరకు వివాదాలలో చిక్కుకుంటూ వివరణ ఇచ్చుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నది ఆది.

అసలు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ అనే కార్యక్రమంలో ఆది పాల్గొనాల్సిన అవసరం లేదు. కానీ, డబ్బు కోసం ఆది ఈ ప్రోగ్రాంలో కనిపిస్తున్నాడు. అయితే ఈ షోలో తెలంగాణ బతుకమ్మ పండుగని అగౌరవపరిచేలా హైపర్ ఆది చేసిన కామెంట్స్ తెలంగాణ ప్రజలనే కాదు, యావత్తు బతుకమ్మ అభిమానులను కూడా తీవ్రంగా బాధించాయి. దాంతో చాలా రగడ జరిగింది.

ఆ రగడ కారణంగా హైపర్ ఆది క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. చెప్పాడు. ఇందుకోసం తాజాగా ఒక వీడియోని విడుదల చేశాడు. వీడియోలో ఆది మాటల్లో.. “మా టీంలో అలాగే మాలో ఆంధ్ర, తెలంగాణ అనే భేదాలు ఎప్పుడు లేవు. మేమందరం కలిసే ఉంటాం, కలిసే నవ్వుతూ కలసిపోయి పనిచేస్తాం. మాకు అన్ని ప్రాంతాల వారి ప్రేమ, అభిమానాలు ఉండబట్టే.. ఈ రోజు మాకంటూ ఒక గుర్తింపు వచ్చింది.

అయితే, షోలో జరిగిన పొరపాటుకు తప్పుకు నా తరుపున, ఆ రోజు స్టేజి పై ఉన్న అందరి తరుపున క్షమాపణలు కోరుతున్నాను’ అంటూ హైపర్ ఆది చెప్పుకొచ్చాడు. మరి ఈ వివాదం ఇంతటితో ముగిసిపోతుందా ? పోలీసు కేసు వరకు వెళ్ళింది కాబట్టి, లీగల్ గా ఈ కేసు ఇంకా ఇలాగే కొనసాగుతుందా ? ఏది ఏమైనా ‘ఆది’ క్షమాపణలు చెప్పక తప్పలేదు. అసలు ఈ బూతు బాగోతాలు కాంట్రవర్సీ కామెంట్స్ ఇంకెన్నాళ్లు ఆది ?