మరో వివాదంలో చల్లా ధర్మారెడ్డి

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. మరో వివాదంలో ధర్మారెడ్డి చిక్కుకున్నారు. హుజూరాబాద్ నియోజకర్గం కమాలాపూర్ మండలం నేరెళ్లలో మహిళా సర్పంచ్ తిరుపతమ్మను ధర్మారెడ్డి అవమానించారు. టీఆర్ఎస్ ప్రచారంలో మహిళా సర్పంచ్ ను నిలబెట్టి మిగిలిన వారంతా కుర్చీల్లో కూర్చొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే సాక్షిగా మహిళ సర్పంచ్ కు అవమానం జరిగిందని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. ధర్మారెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో దళితులను, ఇప్పుడు బీసీలను అవమాన […]

Written By: Suresh, Updated On : June 17, 2021 4:23 pm
Follow us on

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. మరో వివాదంలో ధర్మారెడ్డి చిక్కుకున్నారు. హుజూరాబాద్ నియోజకర్గం కమాలాపూర్ మండలం నేరెళ్లలో మహిళా సర్పంచ్ తిరుపతమ్మను ధర్మారెడ్డి అవమానించారు. టీఆర్ఎస్ ప్రచారంలో మహిళా సర్పంచ్ ను నిలబెట్టి మిగిలిన వారంతా కుర్చీల్లో కూర్చొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే సాక్షిగా మహిళ సర్పంచ్ కు అవమానం జరిగిందని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. ధర్మారెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో దళితులను, ఇప్పుడు బీసీలను అవమాన పరిచారని చల్లా పై విమర్శలు గుప్పిస్తున్నారు.