https://oktelugu.com/

Premi Vishwanath : కార్తీక దీపం వంటలక్క భర్త ఎవరు? ఏమి చేస్తాడో తెలుసా? ఆయన బ్యాగ్రౌండ్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!

ప్రేమి విశ్వనాథ్ భర్త గురించి తెలుగు వారికి తెలియదు. కానీ అతను కూడా ఇండస్ట్రీలో చాలా ఫేమస్. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి. ప్రేమీ విశ్వనాథ్ భర్త పేరు డాక్టర్ వినీత్ భట్. ఈయన కేరళలలో ప్రముఖ జ్యోతిష్య నిపుణులు. 2017లో వరల్డ్స్ బెస్ట్ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు పొందారు.

Written By:
  • S Reddy
  • , Updated On : July 21, 2024 / 01:28 PM IST
    Follow us on

    Premi Vishwanath : కార్తీక దీపం అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు వంటలక్క అలియాస్ దీప. ఆ సీరియల్ సక్సెస్ లో ఈ పాత్రకు ఉన్న ప్రధాన్యత ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వంటలక్క పాత్ర చేసిన ప్రేమీ విశ్వనాథ్ ని అందరూ తెలుగు నటి అనుకుంటారు. నిజానికి ఆమె మలయాళ నటి. ఈమె బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు. ఆమె భర్త ఎవరు? నేపథ్యం ఏమిటో? చూద్దాం..

    కార్తీకదీపం సీరియల్ తో వంటలక్కగా పాప్యులర్ అయ్యింది నటి ప్రేమీ విశ్వనాథ్. బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్ సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. దాదాపు 7 ఏళ్ల పాటు రికార్డ్ స్థాయి టీఆర్పీతో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. దీప, డాక్టర్ బాబు, మోనిత పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ముగ్గురు చుట్టే కథ అంతా నడిచేది. ముఖ్యంగా వంటలక్క అలియాస్ దీప పండించే ఎమోషన్స్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.

    కార్తీక్ తన భార్య దీప ను అనుమానించడం .. తాను తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి దీప ప్రయత్నించడం… ఈ పాయింట్ తో ఏళ్లకు ఏళ్ళు సీరియల్ ని నడిపించేశాడు దర్శకుడు. కార్తీక దీపం ప్రధాన పాత్రలో నటించిన మలయాళ నటి ప్రేమీ విశ్వనాథ్ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వంటలక్క గా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయింది. మలయాళంలో పలు సీరియల్స్ లో నటించింది ప్రేమీ విశ్వనాథ్. కేవలం ఒకేఒక కార్తీక దీపం సీరియల్ తో తెలుగులో ఎక్కడలేని ఫేమ్ తెచ్చుకుంది.

    కాగా ప్రేమి విశ్వనాధ్ వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ప్రేమీ విశ్వనాథ్ కుటుంబ సభ్యుల వివరాలు అందుబాటులో లేవు. ఇటీవల ప్రేమీ విశ్వనాథ్ తన కొడుకుతో రీల్స్ చేసి షేర్ చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వంటలక్క కు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా… అని నెటిజన్లు ఆశ్చర్యపోయారు. దీంతో ఆమె భర్త ఎవరు అని ఆరా తీయడం మొదలుపెట్టారు.

    ప్రేమి విశ్వనాథ్ భర్త గురించి తెలుగు వారికి తెలియదు. కానీ అతను కూడా ఇండస్ట్రీలో చాలా ఫేమస్. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి. ప్రేమీ విశ్వనాథ్ భర్త పేరు డాక్టర్ వినీత్ భట్. ఈయన కేరళలలో ప్రముఖ జ్యోతిష్య నిపుణులు. 2017లో వరల్డ్స్ బెస్ట్ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు పొందారు. అలాగే మలయాళ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్. ఇక ప్రేమీ విశ్వనాథ్ కొడుకు పేరు మనుజిత్. ఇతడు జిమ్ ట్రైనర్ గా వర్క్ చేస్తున్నాడు. మనుజిత్ పక్కా హీరో మెటీరియల్. మంచి హైట్, శరీర ధారుడ్యం కలిగి ఉన్నాడు. మనుజిత్ త్వరలో హీరోగా లాంచ్ అయ్యే అవకాశం కలదు.

    పేరుకే ప్రేమీ విశ్వనాథ్ సీరియల్ నటి. ఆమెది సంపన్నుల కుటుంబం అట. వీరికి కేరళలో భారీగా ఆస్తులు ఉన్నాయట. ఒక స్టూడియో కూడా ఉందని సమాచారం. అక్కడ సినిమాలు, సీరియల్స్ షూటింగ్స్ జరుపుకుంటాయట. ప్యాషన్ తో ప్రేమీ విశ్వనాథ్ నటిగా కొనసాగుతుంది. ఆమెకు ఎంత తిన్నా తరగనంత సంపద ఉందట. వంటలక్క నేపథ్యం తెలిశాక ఎవరైనా అవాక్కు అవ్వాల్సిందే.

    ఆ మధ్య ప్రేమీ విశ్వనాథ్ తెలుగు ఫ్యాన్స్ ఆమెను బాగా మిస్ అయ్యారు. కార్తీక దీపం సీరియల్ ముగియడంతో ఆమె తెలుగు బుల్లితెర ఆడియన్స్ కి దూరం అయ్యారు. ఇటీవల కార్తీక దీపం 2 మొదలైంది. మరోసారి ప్రేమీ తన నటనతో ప్రేక్షకుల మనసులు దోచేస్తుంది. అయితే కార్తీక దీపం 1 రేంజ్ లో పార్ట్ 2కి ఆదరణ దక్కడం లేదు.