Horoscope Today: 2025 మే 8 బుధవారం రోజున ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో సంచరించనున్నాడు. మేష రాశివారు ఈరోజు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే అనేక సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశి వారు ప్రత్యర్థుల పట్ల జగ్రత్తగా ఉండాలి. ప్రతీ విషయంలో జోక్యం చేసుకోకూడదు. ఖర్చులు పెరుగుతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి.
వృషభ రాశి:
పెండింగు పనులను సకాలంలో పూర్తి చేయాలి. విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
మిథునం:
స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. ఆర్థిక విషయాలపై ఎక్కువగా దృష్టి పెడుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.
కర్కాటకం:
ఈ రాశి వారు పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులు పదోన్నతి పొందుతారు. వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.
సింహ:
ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. బంధువుల నుంచి ఓ శుభవార్త వింటారు. కొన్ని పనుల నిమిత్తం బిజీగా ఉంటారు. ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారు ఓ సమాచారం అందుకుంటారు.
కన్య:
వైవాహిక జీవితం బాగుంటుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. అయినా ఉత్సాహంతో వాటిని ఎదుర్కొంటారు.
తుల:
ఈ రాశి వారికి ఈరోజు అనుకోని విజయాలు అందుతాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు పై అధికారులు ఆకట్టుకునేలా విధులు నిర్వహిస్తారు.
వృశ్చికం:
లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆహారపు అలవాట్లను మార్చుకోవద్దు. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. వ్యక్తిగతంగా కొన్ని విజయాలు సాధిస్తారు.
ధనస్సు:
ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువే. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. ఖర్చులు పెరుగుతాయి.
మకర:
కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆదాయం కొరతను ఎదుర్కొంటారు. విద్యార్థులు ముఖ్యమైన సమాచారం వింటారు. ప్రతి దానిపై స్పందించాల్సన అవసరం లేదు.
కుంభం:
వ్యాపారులు ఆర్థిక వృద్ధి సాధిస్తారు. కొన్ని సమస్యలు ఏర్పడుతాయి. ఉద్యోగులు కొత్త తరహా జీవితాన్ని ప్రారంభిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.
మీనం:
పెండింగు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి.