
జమున హ్యాచరీస్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మంగళవారం హైకోర్టు జమున హ్యాచరీస్ కేసును విచారణ చేపట్టింది. జమున హ్యాచరీస్ కు సరైన పద్ధతిలో నోటీసులు సర్వే చేసి ప్రభుత్వం విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారం సమయం ఇవ్వాలని కోరింది. శుక్రవారం ఇచ్చి సోమవారం రిప్లై ఇవ్వమనేలా ఉండకూడదని షరతు విధించింది. వెనుక గేటు నుంచి కాదు రాచమార్గంలో వెళ్లి విచారణ జరపాలని ఆదేశించింది. మే 1,2 వ తేదీల్లో జరిగిన విచారణను పరిగణనలోకి తీసుకొవద్దని చెప్పింది. ప్రభుత్వ నివేదిక చెల్లదని పేర్కొంది. అధికారులు ఉల్లంఘనకు పాల్పడినట్లు హైకోర్టు అభిప్రాయపడింది.