Srileela : ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగి, ఆ తర్వాత వరుస డిజాస్టర్ ఫ్లాప్ సినిమాల కారణంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీ ని వదలి బాలీవుడ్ కి వెళ్లిపోయిన హీరోయిన్లు మన ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు. అలాంటి హీరోయిన్స్ జాబితాలోకి శ్రీలీల(Sri leela) చేరిపోయింది. ‘పెళ్లి సందడి’ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈ శ్రీలీల, ఆ తర్వాత ‘ధమాకా’ చిత్రంతో ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిపోయింది. ఆ చిత్రం తర్వాత ఈమె చేసిన సినిమాల్లో కేవలం ‘భగవంత్ కేసరి’ మాత్రమే హిట్ అయ్యింది. మిగిలిన సినిమాలన్నీ ఘోరమైన డిజాస్టర్స్ గా నిలిచాయి. అయితే ఈ క్యూట్ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తుంది. కార్తీక్ ఆర్యన్Kartik Aryan||) తో ఒక లవ్ స్టోరీ చేస్తున్న శ్రీలీల, ఇబ్రహీం ఖాన్ తో మరో సినిమా చేస్తుంది.
Also Read : శ్రీలీల కి అంత సీన్ లేదు..ఆమె వల్లే సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి అంటూ ‘ధమాకా’ రచయిత షాకింగ్ కామెంట్స్!
ఇబ్రహీం ఖాన్ మరెవరో కాదు, ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) కుమారుడు. ఇదే అతనికి తొలి చిత్రం కూడా. శ్రీలీల కి అకస్మాత్తుగా బాలీవుడ్ లో ఇలా ఆఫర్స్ రావడానికి కారణం ‘పుష్ప 2’ లో కిస్సిక్ పాట పెద్ద హిట్ అవ్వడం వల్లే. ఈ పాట అక్కడి ఆడియన్స్ కి బాగా దగ్గర అవ్వడంతో ఆమెకు బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ అమ్మాయి ఇబ్రహీం ఖాన్(ibrahim khan) తో చాలా లోతైన రిలేషన్ షిప్ లో ఉందని బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన గాసిప్. ఎందుకంటే ఈ జంట ముంబై నగర వీధుల్లో ఎక్కువగా కలిసి తిరగడం, ప్రైవేట్ పార్టీలకు, పబ్బులకు కలిసి రెగ్యులర్ గా వెళ్తుండడం వంటివి చేస్తున్నారు. అంతే కాదు కుటుంబం మొత్తం కలిసి చేసుకున్న పండుగల్లో కూడా శ్రీలీల తన తల్లితో కలిసి హాజరు అవుతుంది.
రీసెంట్ గానే ఇబ్రహీం ఖాన్ పుట్టిన రోజు వేడుకలకు హాజరైన శ్రీలీల, తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఒక ఫోటో ని షేర్ చేస్తూ ‘హ్యాపీ బర్త్డే ఇగ్లీ. నువ్వు త్వరలో ప్రపంచానికి చూపించబోయే సర్ప్రైజ్ కోసం నేను వెయిట్ చేయలేకపోతున్నాను. ఇది కేవలం ఆరంభం మాత్రమే’ అంటూ అతనితో కలిసి ఒక సెల్ఫీ దిగి, ఆ ఫోటో ని తన స్టోరీ లో షేర్ చేసింది. ఈ ఫోటోలో శ్రీలీల తల్లి కూడా ఉంది. పేరుతో పిలవకుండా, ముద్దు పేరుతో పిలిచి శ్రీలీల ఒక హీరోని విష్ చేయడం ఇదే తొలిసారి. దాదాపుగా అందరి హీరోలతో కలిసి ఆమె సినిమాలు చేసింది కానీ, ఈ హీరో గురించి ఇంత స్పెషల్ గా చూస్తుందంటే కచ్చితంగా వీళ్ళ మధ్య ఎదో జరుగుతుంది అనే విషయం అందరికీ అర్థమైపోయింది.
Also Read : హద్దులు దాటేసిన శ్రీలీల..బాలీవుడ్ అంటే ఎందుకంత మోజు..? టాలీవుడ్ అంటే అంత చులకనా?