https://oktelugu.com/

Srileela : హద్దులు దాటేసిన శ్రీలీల..బాలీవుడ్ అంటే ఎందుకంత మోజు..? టాలీవుడ్ అంటే అంత చులకనా?

రీసెంట్ గా ఇండస్ట్రీ లో సెన్సేషన్ సృష్టించిన హీరోయిన్ శ్రీలీల(Srileela) కూడా ఇలాంటి సుద్దపూస మాటలు చాలానే మాట్లాడింది. నేను లిప్ లాక్ సన్నివేశాల్లో నటించను అని చెప్పుకొచ్చింది.

Written By: , Updated On : February 16, 2025 / 07:26 PM IST
Srileela

Srileela

Follow us on

Srileela : కొంతమంది హీరోయిన్లు టాలీవుడ్ లో ఉన్నంత కాలం చాలా మర్యాదగా ఉన్నట్టు వ్యవహరిస్తారు. ముద్దు సన్నివేశాలకు , రొమాన్స్ సన్నివేశాలకు నో అని చెప్తుంటారు. కానీ టాలీవుడ్ ని దాటి బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత ఆ హద్దులు చెరిపేస్తుంటారు. తమన్నా(Tamanna Bhatiya) ఒకప్పుడు ఇలాగే చెప్పేది. నాకు రొమాంటిక్ సన్నివేశాలు చేయడం ఇష్టం లేదు, ఎందుకంటే నా ప్రతీ సినిమాని నా తల్లిదండ్రులు చూస్తుంటారు, రొమాంటిక్ సన్నివేశాలు వచ్చినప్పుడు వాళ్ళు సిగ్గుతో తల దించుకుంటారు, వాళ్లకు అలాంటి పరిస్థితి కలిపించడం నాకు ఇష్టం లేదు, అందుకే అలాంటి సన్నివేశాలకు ఒప్పుకోను అని చెప్పుకొచ్చేది. ఆమె మాటలు విన్న తర్వాత అబ్బో తమన్నా ఎంత పద్ధతైన అమ్మాయి అని అందరూ అనుకున్నారు. రీసెంట్ గా ఇండస్ట్రీ లో సెన్సేషన్ సృష్టించిన హీరోయిన్ శ్రీలీల(Srileela) కూడా ఇలాంటి సుద్దపూస మాటలు చాలానే మాట్లాడింది. నేను లిప్ లాక్ సన్నివేశాల్లో నటించను అని చెప్పుకొచ్చింది.

నా తొలి లిప్ లాక్ నా కాబోయే భర్తకు మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది. ఈమె గురించి తెలియనోళ్లు అబ్బో అమ్మాయి చాలా మంచిది, ఏమైనా తెలుగు అమ్మాయిలు, తెలుగు అమ్మాయిలే అని గర్వంగా కొంతమంది చెప్పుకున్నారు. కానీ ఈమె మన టాలీవుడ్ లోకి రాకముందు కన్నడ లో పలు సినిమాలు చేసింది. అక్కడ ఈమె తొలిసినిమాలోనే బోలెడన్ని లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది. కానీ కాస్త స్టార్ ఇమేజ్ రాగానే అలాంటి సన్నివేశాలకు దూరమని దర్శక నిర్మాతలకు చెప్పేసింది. కేవలం చెప్పడం మాత్రమే కాదు, ‘టిల్లు స్క్వేర్’ మూవీ లో హీరోయిన్ అవకాశం వస్తే, ముద్దు సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయని రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత ఆమె స్థానంలోకి అనుపమ పరమేశ్వరన్ వచ్చింది. ఆ పాత్రకు ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. తెలుగు లో ఈ రేంజ్ లిమిట్స్ పెట్టుకున్న శ్రీలీల, హిందీ లో మాత్రం హద్దులు చెరిపేసింది.

రీసెంట్ గానే ఆమె బాలీవుడ్ లో రెండు సినిమాల షూటింగ్స్ లో తరచూ పాల్గొంటూ ఉంది. అందులో సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం ఖాన్ మొదటి సినిమా కాగా, మరొకటి కార్తీక్ ఆర్యన్(Karthik Aryan) హీరో గా నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ. ఆషీకీ 3 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ఇటీవలే విడుదల చేసారు. ఈ టీజర్ లో శ్రీలీల కార్తీక్ ఆర్యన్ కి ముద్దులు పెట్టడాన్ని చూసి అభిమానులు షాక్ కి గురయ్యారు. సినిమా మూడ్ ని చూస్తుంటే ఇలాంటి సన్నివేశాలు చాలానే ఉన్నాయని అర్థం అవుతుంది. బాలీవుడ్ కి అవసరం లేని హద్దులు, టాలీవుడ్ కి ఎందుకు?, అంటే నిన్ను ఆదరించే తెలుగు ఆడియన్స్ అంటే అంత చులకనా? అంటూ శ్రీలీల ని ట్యాగ్ చేసి తిడుతున్నారు నెటిజెన్స్.