Horoscope Today(6)
Today Horoscope In Telugu: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశరాశిలపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది.. ఏ సమయంలో రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండనుంది. కొన్ని రాశుల వారికి శత్రువుల బెడద ఎక్కువగా ఉండవుంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈరోజు వ్యాపారంలో బిజీ షెడ్యూల్ లో ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండదు. దీంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఉద్యోగులు ఒత్తిడిని ఎదుర్కొంటారు. కుటుంబంలో వాగ్వాదా ఉంటుంది. మాటలను అదుపులో ఉంచుకోవడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది. కొత్త వ్యక్తులతో వ్యాపారులు ఒప్పందాన్ని చేసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : కొత్తగా పెట్టుబడులు పెట్టేముందు కుటుంబ సభ్యులను సంప్రదించాలి. పిల్లల చదువుపై చిలక నిర్ణయం తీసుకుంటారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. తోటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వారి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): వ్యాపారులు భార్య లాభాలు పొందుతారు. ఎక్కడైనా పెట్టు పనులు పెట్టేముందు పెద్దలను సంప్రదించాలి. విహార యాత్రలకు వెళ్లాలంటే కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవాలి. ఖర్చుల విషయంలో ప్రవక్తగా ఉండాలి. ఇంట్లో వారికి చెప్పకుండా ఏ పని మొదలు పెట్టాడు. ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయితే తోటి వారి సహకారంతో ఇబ్బందుల నుంచి బయటపడతారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. చట్టపరమైన చిక్కులు ఉంటే నేటితో పరిష్కారం అవుతాయి. బంధువుల్లో ఒకరి ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాలను జరిపే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. కొన్ని పనులను వాయిదా వేసుకోవడమే మంచిది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త వారితో ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. ఉపాధి కోసం చూసేవారికి శుభవార్త వింటారు. వ్యాపారులు కొంతవరకు నష్టాన్ని ఎదుర్కొంటారు. అయితే కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కొత్తగా ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. కొన్ని కారణాలవల్ల అనారోగ్యానికి గురవుతారు. సాయంత్రం స్నేహితులను కలుస్తారు. బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. దీంతో ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొన్న తోటి వారి సహాయంతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఏదైనా ప్రత్యేకంగా పనిని చేయడానికి ఇతరుల సాయం తీసుకుంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : మీ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు అధికారులతో వాగ్వాదాల్లో ఉంటాయి. అయితే మాటలు మాధుర్యంతో సమస్య పరిష్కారం అవుతుంది. లేకుంటే సంబంధాల్లో చీలికలు వస్తాయి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులకు కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో ప్రయాణాలు చేస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఇప్పటివరకు ఉన్న వివాదాల నుంచి బయటపడతారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు ఉద్యోగుల సహాయం తీసుకుంటారు. వ్యాపారులు పెద్దల సలహాలతో కొత్త పెట్టుబడులు పెడతారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. సాయంత్రం కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా సమయాన్ని గడుపుతారు. విహారయాత్రలకు వెళ్లడానికి ప్లాన్ చేస్తారు. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వ్యాపారులు అనుకోకుండా లాభాలు పొందుతారు. ఉద్యోగులు తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే చాకచక్యంగా వారిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. ఇతరులకు డబ్బు అప్పుగా ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. కొత్తగా ఎవరు పరిచయమైన వారితో అప్పుడే ఆర్థిక వ్యవహారాలు జరపొద్దు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : విద్యార్థుల కెరియర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. బయటకు వెళ్లాలని ఆలోచిస్తే ప్రయాణాలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్థుల్లో ఒకరి నుంచి ఇబ్బందులు పడతారు. కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం స్నేహితులతో గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : రాజకీయ నాయకులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. పాత స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేసే వారికి కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఇతరులకు డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోండి. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులనుంచి బయటపడతారు. ఉద్యోగాలు చేసేవారు కొన్ని శుభవార్తలు వింటారు. కొత్తగా ప్రాజెక్టులు ప్రారంభించే వారు పెద్దల సలహా తీసుకోవాలి.