https://oktelugu.com/

Karthikeya: తన కాబోయే భార్యను పరిచయం చేసిన యంగ్​ హీరో కార్తికేయ!

Karthikeya: ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్​ హీరోలో ఒకరిగా గుర్తింపు పొందిన యంగ్​ హీరో కార్తికేయ. అంతకుముందు కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ.. ఈ సినిమాలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.  తాజాగా, కార్తికేయ హీరోగా రానున్న సినిమా రాజా విక్రమార్క. ఈ సినిమా నవంబరు 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమోషన్స్​లో వేగం పెంచిన యూనిట్​ శనివారం ప్రీరిలీజ్​ ఈవెంట్​ను నిర్వహించింది. ఈ క్రమంలోనే కార్తికేయ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 7, 2021 / 11:23 AM IST
    Follow us on

    Karthikeya: ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్​ హీరోలో ఒకరిగా గుర్తింపు పొందిన యంగ్​ హీరో కార్తికేయ. అంతకుముందు కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ.. ఈ సినిమాలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.  తాజాగా, కార్తికేయ హీరోగా రానున్న సినిమా రాజా విక్రమార్క. ఈ సినిమా నవంబరు 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమోషన్స్​లో వేగం పెంచిన యూనిట్​ శనివారం ప్రీరిలీజ్​ ఈవెంట్​ను నిర్వహించింది. ఈ క్రమంలోనే కార్తికేయ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వివరించారు.

    తనకు కాబోయే భార్యను అందరికీ పరిచయం చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరిచారు. స్టేజిపైనే మోకాళ్లపై కూర్చొని ఆమెకు ప్రపోజ్​ చేశారు. నవంబరు 21న వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నట్లు కార్తికేయ ప్రకటించారు. ఈ క్రమంలోనే కాబోయే భార్యను స్టేజిపైకి పిలిచి అందరికీ పరిచయం చేశారు. కాగా, కార్తికేయ కాబోయే భార్య పేరు లోహిత్. వీరిద్దరికి చదువుకునే రోజుల్లోనే పరిచయం ఏర్పడిందట. అనంతరం వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. తన జీవితంలో హీరో కావడానికి ఎంత కష్టపడ్డాడో.. అంతే కష్టపడి అమ్మాయిని ప్రేమించి ఒప్పించుకున్నా అని హీరో కార్తికేయ అన్నారు.

    ఇటీవల కార్తికేయ హీరోగా నటించిన చావు కబురు చల్లగా సినిమా ఎంత సూపర్​ హిట్​ కొట్టిందో అందరికీ తెలిసిందే. చావు, పుట్టుక మధ్య ఉన్న సంబంధాలను ఎంతో చక్కగా వివరించి..  దర్శకుడు కౌశిక్​ భావోద్వేగ భరితమైన సీన్లతో ఎంతో చక్కగా సినిమాను రూపొందించారు. ముఖ్యంగా సినిమాకు బెజోయ్​ అందించిన మ్యూజిక్​ ప్రాణం పోసిందనే చెప్పాలి. లావణ్య త్రిపాఠి ఇందులో హీరోయిన్​గా నటించింది.