Anushka Shetty: ముద్దుగుమ్మ “అనుష్క” కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన… యూవీ క్రియేషన్స్

Anushka Shetty: అనుష్క శెట్టి… సూపర్ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు  సంపాదించుకుంది. ఆ తర్వాత వచ్చిన విక్రమార్కుడు సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనుష్కకు ఆఫర్లు క్యూకట్టాయి. వరుస చిత్రాలతో టాలీవుడ్ లో టాప్ రేంజ్ కి ఎదిగింది . స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు దక్కించుకొని తెలుగు తమిళ్ భాషల్లో వరుసగా సినిమాలు చేసింది స్వీటి. కమర్షియల్ సినిమాలతో […]

Written By: Raghava Rao Gara, Updated On : November 7, 2021 10:55 am
Follow us on

Anushka Shetty: అనుష్క శెట్టి… సూపర్ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు  సంపాదించుకుంది. ఆ తర్వాత వచ్చిన విక్రమార్కుడు సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనుష్కకు ఆఫర్లు క్యూకట్టాయి. వరుస చిత్రాలతో టాలీవుడ్ లో టాప్ రేంజ్ కి ఎదిగింది . స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు దక్కించుకొని తెలుగు తమిళ్ భాషల్లో వరుసగా సినిమాలు చేసింది స్వీటి. కమర్షియల్ సినిమాలతో పాటులేడీ ఓరియెంటెడ్ మూవీస్ లలో కూడా నటించి మెప్పించింది అనుష్క. అరుంధతి సినిమాతో ఆమె సినిమా కెరీర్ ఒక టర్నింగ్ పాయింట్ తీసుకుందని చెప్పాలి. ఆ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అనంతరం వర్ణ, రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి వంటి సినిమాలతో ఆకట్టుకుంది. కాగా బాహుబలి సినిమాతో ఒక సాలిడ్ ఐ‌టి అందుకున్న ఈ భామ ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుంది. ఇటీవల నిశ్శబ్దం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అది ఆశించిన స్థాయిలో ప్రేక్శకులను అలరించలేకపోయింది. మెగాస్టార్ నటించిన సైరా సినిమాలో ఝాన్సీ లక్ష్మీ భాయ్ గా చిన్న పాత్రలో కనిపించింది అనుష్క. అనుష్క నటన,  అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు ఆమె అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.

https://twitter.com/UV_Creations/status/1457195353057349633?s=20

ఈ మేరకు యూవీ క్రియేషన్స్ అనుష్క తో ఓ సినిమా తీయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మహేష్ బాబు దర్శకత్వంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. అనుష్క కు ఇది 48వ సినిమా కావడం విశేషం. అలానే యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అనుష్క గతంలో మిర్చి, భాగమతి అనే సినిమాలు చేశారు. ఇక ఈ తాజా అప్డేట్ తో అనుష్క ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం నెలకొంది. ఈ హ్యాట్రిక్ మూవీతో అనుష్క మళ్ళీ ఒక సాలిడ్ హిట్ కొట్టాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.