ఎలిమినేషన్ లో భారీ ట్విస్ట్: బుల్లితెరలో దూసుకుపోతున్న నెంబర్ వన్ రియాలిటీ షో బిగ్ బాస్. నాగార్జున వరుసగా మూడోసారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో విజయవంతంగా 63 రోజులు పూర్తి చేసుకుని తొమ్మిదో వారంలోకి అడుగు పెట్టింది. ఇంకొక 42 రోజులు మిగిలి ఉన్న ఈ షో లో ప్రతి వారం ఏదోకటి జరగొచ్చు. గేమ్ ముందుకు సాగాలంటే ప్రతి వారం ఏదొక కంటెస్టెంట్ నామినేట్ అవ్వాల్సిందే… ఆదివారం ఎలిమినేట్ అవ్వాల్సిందే. అలా ప్రస్తుతానికి బిగ్ బాస్ హౌస్ ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు.

ఇలా మొదటివారం నుండు ఇప్పటివరకు వరసగా సరయు, ఉమాదేవి, లహరి షారి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేతా వర్మ, ఆర్టిస్ట్ ప్రియా, లోబో బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. మరి తొమ్మిదో వారానికి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చాలా ఉత్కంఠ రేపుతోంది. తొమ్మిదో వారానికి బిగ్ బాస్ నుండి బయట వెళ్ళడానికి కెప్టెన్ షణ్ముఖ్ జస్వంత్ కాకుండా మిగతా ఇంటి సభ్యులు సిరి హన్మంతు, జస్వంత్ పాదాల, మానస్ నాగులపల్లి, ఆర్ జే కాజల్, వీజే సన్నీ, యాంకర్ రవి, ప్రియాంక సింగ్, విశ్వ, అని మాస్టర్, శ్రీరామ చంద్ర నామినేట్ అయ్యారు.
నామినేషన్స్ లో ట్విస్ట్: నామినేషన్ ప్రక్రియ తర్వాత బిగ్ బాస్ ఒక టాస్క్ నిర్వహించాడు. ఆ టాస్క్ లో గెలిచిన సభ్యులు నామినేషన్ నుండి ఇమ్మ్యూనిటీ పొందుతారు. అలా టాస్క్ లో అని మాస్టర్ ఇమ్మ్యూనిటి పొంది నామినేషన్స్ నుండి తప్పించుకుంది. అంతకు బిగ్ బాస్ అని మాస్టర్ కి ఇచ్చిన పవర్ ని వినియోగించి మానస్ ని నామినేషన్స్ నుండి విముక్తి కల్పిస్తుంది. అలా తొమ్మిది వారం లో కెప్టెన్ షణ్ముఖ్ జస్వంత్, అని మాస్టర్, మానస్ మినహాయించి మిగతా ఇంటి సభ్యులు నామినేషన్స్ లో ఉన్నారు.
డేంజర్ జోన్ లో ఉంది ఆ ఇద్దరే: అయితే సోషల్ మీడియాలో, ఇతర అన్ అఫిషియల్ వెబ్సైట్ లలో చూస్తుంటే విశ్వ, కాజల్, ప్రియాంక డేంజర్ జోన్ లో ఉండగా సన్నీ టాప్ లో కొనసాగుతున్నాడు. విశ్వ, ప్రియాంక తో పోలిస్తే కాజల్ కొంచెం సేఫ్ జోన్ లోనే ఉందని అర్ధమవుతుంది. కానీ ఇంటి నుండి బయటకి వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారం మాత్రం విశ్వ కే ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం విశ్వ, ప్రియాంక సమాన్లు సర్దుకుని ఇంటికి వెళ్లాల్సిందే. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది మాత్రం ఆదివారం ఎపిసోడ్ లో తెలుస్తుంది.