Hero Akhil Zainab Age Gap: అఖిల్ అక్కినేని-జైనబ్ ల వివాహం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అఖిల్ కంటే వయసులో జైనబ్( Zainab Ravdjee) 8 ఏళ్ళు పెద్దది కావడమే అందుకు కారణం. అయితే అఖిల్ ఆమెను వివాహం చేసుకోవడం వెనుక సాలిడ్ రీజన్ ఉందట. అదేమిటో చూద్దాం..
భార్య కంటే భర్త పెద్దవాడై ఉండాలి. ఇది అనాది కాలంగా ఒక సాంప్రదాయంగా ఉంది. ముఖ్యంగా ఇండియాలో ఈ విషయాన్ని చాలా ముఖ్యంగా పరిగణిస్తారు. భార్య భర్తల మధ్య ఒక ఐదేళ్లు ఏజ్ గ్యాప్ ఉండాలి. మారుతున్న సామాజిక సమీకరణాల రీత్యా ఈ సాంప్రదాయం మసకబారుతూ వస్తుంది. ముఖ్యంగా పలువురు సెలెబ్స్ వయసులో తమకంటే పెద్ద అమ్మాయిలను భార్యలుగా తెచ్చుకున్నారు. మహేష్ బాబు, సచిన్ టెండూల్కర్ తో పాటు చాలా మంది స్టార్స్ ఈ లిస్ట్ లో ఉన్నారు. తాజాగా అఖిల్ సైతం వచ్చి చేరాడు. కింగ్ నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ కి జూన్ 6న వివాహమైంది. జైనబ్ ( Zainab) అనే అమ్మాయితో ఆయన ఏడడుగులు వేశారు.
Also Read: Samantha Attend Akhil Marriage : అక్కినేని అఖిల్ పెళ్ళిలో సమంత హల్చల్..సంచలనంగా మారిన వీడియో!
హైదరాబాద్ కి చెందిన జైనబ్ ( Zainab)వయసులో అఖిల్ కంటే చాలా పెద్దది. అఖిల్ వయసు 31 ఏళ్ళు కాగా, జైనబ్ వయసు 39 అని సమాచారం. అంటే 8 ఏళ్ళు వయసులో ఆమె పెద్దది. ఇద్దరి మధ్య ఓ దశాబ్దం గ్యాప్ ఉందన్నమాట. ఈ పరిణామం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది. అఖిల్ కంటే అంత పెద్ద అమ్మాయిని కోడలిగా నాగార్జున ఎలా అంగీకరించారు. ఆమెకు వేల కోట్ల ఆస్తులు ఉన్నయనా? వ్యాపార కుటుంబం అనా? నాగార్జునకు విలువల కంటే డబ్బులే ముఖ్యమా? అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే ఇది డబ్బుకు సంబంధించిన విషయం కాదు. వయసులో తనకంటే పెద్దదైన అమ్మాయిని అఖిల్ పెళ్లి చేసుకోవడం వెనుక బలమైన కారణం ఉందట. అదేమిటంటే.. జైనబ్ ని అఖిల్ ప్రేమించాడట. జైనబ్ ముస్లిం అమ్మాయి కాగా, ఆమె తండ్రి జుల్ఫీ రవ్డ్జీ ప్రముఖ వ్యాపారవేత్త. జుల్ఫీ-నాగార్జున కుటుంబాల మధ్య చాలా కాలంగా సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో అఖిల్ తో జైనబ్ కి పరిచయం ఏర్పడింది. దాదాపు మూడేళ్ళుగా జైనబ్, అఖిల్ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. రహస్యంగా వీరి ప్రేమ ప్రయాణం సాగిందట. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కారట. అదన్నమాట మేటర్.
ఇక అఖిల్ కెరీర్ విషయానికి వస్తే పరిశ్రమలో అడుగుపెట్టి దశాబ్దం అవుతుంది. అఖిల్ కి బ్రేక్ ఇచ్చే సినిమా పడలేదు. అఖిల్ నటించిన చిత్రాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మాత్రమే హిట్ టాక్ సొంతం చేసుకుంది. అఖిల్ చివరి చిత్రం ఏజెంట్ డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం ఆయన లైనింగ్ టైటిల్ తో విలేజ్ డ్రామా చేస్తున్నారు. ఈ చిత్రంలో మాస్ గెటప్ తో అలరిస్తున్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న లెనిన్ పై అఖిల్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. అఖిల్ కి జంటగా శ్రీలీల నటిస్తుంది.