Samantha Attend Akhil Marriage : అక్కినేని అఖిల్(Akkineni Akhil) పెళ్లి నిన్న హైదరాబాద్ లో తెల్లవారుజామున మూడు గంటలకు గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. జైనబ్(Zainab) అనే అమ్మాయితో చాలా కాలం నుండి ప్రేమలో ఉంటున్న అఖిల్, గత ఏడాది నాగ చైతన్య(Akkineni Naga Chaitanya),శోభిత(Sobhita Dhulipala) ల నిశ్చితార్థం జరిగిన కొద్దిరోజులకే తన నిశ్చితార్థం కూడా జరిపించుకున్నాడు. ఈ ఏడాది రెండు మూడు నెలల క్రితమే పెళ్లి చేసుకుంటాడేమో అని అభిమానులు ఆశించారు కానీ,మంచి శుభ ముహార్తాన్ని చూసి నిన్న జరిపించారు. ఈ వివాహమహోత్సవానికి అక్కినేని కుటుంబానికి అత్యంత సన్నిహితం గా ఉండే వాళ్ళు తప్ప పెద్దగా ఎవ్వరూ హాజరు కాలేదు. ముఖ్యంగా దగ్గుబాటి కుటుంబం డుమ్మా కొట్టడం పెద్ద చర్చకు దారి తీసింది. అయితే ఈ పెళ్ళికి ఎవరొచ్చినా రాకపోయినా సమంత(Samantha Ruth Prabhu) మాత్రం వచ్చింది అంటూ యూట్యూబ్ లో కొన్ని థంబ్ నెయిల్స్ దర్శనమిచ్చాయి. నిన్న మొత్తం ఎక్కడ చూసినా ఈ వీడియోలే కనిపించాయి.
అయితే నాగ చైతన్య తో విడిపోయినప్పటికీ సమంత అఖిల్ తో మాత్రం మంచి రిలేషన్ ని మైంటైన్ చేస్తూ వచ్చింది. విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా రెండేళ్లు అఖిల్ కి పుట్టినరోజు సమయంలో శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో స్టోరీలు పెట్టింది. అదే విధంగా అఖిల్ కూడా సమంత అనారోగ్యానికి గురైనప్పుడు త్వరగా కోలుకోవాలని ఆమె పోస్టు క్రింద కామెంట్ కూడా పెట్టాడు. అప్పట్లో ఇవన్నీ పెద్ద చర్చకు దారి తీశాయి. అఖిల్ తో మంచిగానే ఉంటుంది కాబట్టి సమంత అతని పెళ్ళికి హాజరు అవుతుందని నెటిజెన్స్ నిజంగానే నమ్మారు. అందుకే సమంత అఖిల్ పెళ్ళికి వచ్చింది అనగానే ఆ వీడియోలకు లక్షల సంఖ్యలో లైక్స్,కామెంట్స్ యూట్యూబ్ లో వచ్చాయి. కానీ సమంత నిజంగా పెళ్ళికి రాలేదు. ఆమె పాత వీడియోలను కొత్త వీడియోకి అటాచ్ చేస్తూ ఈ పుకారుని సృష్టించారు.
కనీసం తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అయినా అఖిల్ కి శుభాకాంక్షలు తెలియజేస్తుందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు అలాంటిది జరగలేదు. ఈరోజు చివర్లో అయినా జరుగుతుందో లేదో చూద్దాం. అయితే కొంతమంది సమంత అఖిల్ రిసెప్షన్ కి వస్తుందని అంటున్నారు. ఇదే నిజమైతే సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది అనే చెప్పాలి. కానీ సాధ్యమైనంత వరకు అది జరగకపోవచ్చని అంటున్నారు. ఇక సమంత కెరీర్ విషయానికి వస్తే అనారోగ్యం కారణంగా కొంతకాలం విశ్రాంతి తీసుకొని సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఆమె మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి నిర్మాత శుభమ్ అనే చిత్రాన్ని నిర్మించి భారీ హిట్ ని అందుకుంది. అలాగే ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రం లో ప్రధాన పాత్ర పోషిస్తున్న సమంత, ‘రక్త బ్రహ్మాండ’ అనే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది.