Health Secrets Behind Ancient Traditions: మానవులు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి పూర్వకాలంలో పెద్దలు కొన్ని పద్ధతులు ఆలంబించారు. వాటిని ఇప్పుడు చూస్తే మూఢనమ్మకాలు అనిపిస్తున్నప్పటికీ ఆ కాలంలో వాటిని ఆరోగ్యం లేదా అవసరాలకు ఉపయోగించారని కొందరు చెబుతూ ఉంటారు. పూల కాలంలో అవలంబించిన కొన్ని పద్ధతులతో అప్పటి వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ముఖ్యంగా కొన్ని పద్ధతుల వల్ల సామాజిక సంబంధాలు మెరుగ్గా ఉండేవి. ముఖ్యంగా పెద్దలపట్ల ప్రతి ఒక్కరికి ఉన్న గౌరవం వారి జీవితాన్ని ఉన్నత స్థితిలో నిలబెట్టేది. అయితే నేటి కాలంలో కొన్ని మార్పులు రావడంతో ఆనాటి పద్ధతులు పాటించడం లేదు. దీంతో అనేక కొత్త రోగాలు అందుబాటులోకి వస్తున్నాయి. అంతేకాకుండా మనసుల మధ్య సంబంధాలు చెడిపోతున్నాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిందేంటంటే పెద్దలను గౌరవించడం. పెద్దలను గౌరవించకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయని కొందరు అంటారు. ముఖ్యంగా వారు ఎదురుగా వస్తే లేచి నిలబడాలని కొందరు చెబుతారు. అయితే ఇలా లేచి నిలబడకపోతే ఆయుష్షు తగ్గుతుందని కొందరు అంటారు. అదెలా ఉంటుందంటే?
సాధారణంగా సంస్కారం ఉన్నవారు పెద్దలు కనిపించగానే తమకంటే చిన్న వయసు వారు వెంటనే లేచి నిల్చుని నమస్కరిస్తారు. వారు కూర్చున్న తర్వాతే చిన్న వయసు వారు కూర్చుంటారు. అయితే నేటి కాలంలో కొంతమంది అలా చేయడం లేదు. పెద్దలకు ఏమాత్రం గౌరవం లేకుండా వారు కనిపించినా కుర్చీలో నుంచి లేవడం లేదు. అయితే అలా చేయడంవల్ల ఆయుష్షు తగ్గుతుందని కొందరికి చెబుతున్నారు. ఉదాహరణకు తమకంటే పెద్దవారు వచ్చినప్పుడు.. లేదా వారు కనిపించినప్పుడు వెంటనే లేవడం వల్ల శరీరంలోని జీవక్రియ ఉత్తేజితమవుతుంది. అంటే పెద్దల పట్ల ఉన్న గౌరవమే కాకుండా శరీరం ఒక క్రమ పద్ధతిలో ఉంటూ అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తాయి. ఇలా పెద్దలు కనిపించిన ప్రతిసారి తక్కున లేవడం వల్ల శరీరం ఎంతో ఆక్టివ్ గా మారిపోతుంది. ఇలా ఎప్పటికీ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటూ ఆయుష్షు పెరిగే అవకాశం ఉందని పెద్దలు చెబుతుంటారు.
అంతేకాకుండా పెద్దలు కనిపించినప్పుడు నిల్చడం వల్ల వారి పట్ల ఉన్న గౌరవాన్ని ప్రదర్శించిన వారవుతారు. దీంతో వారు సైతం తమకంటే చిన్నవారికి గౌరవం ఇస్తూ వారికి కావాల్సిన సలహాలు ఇస్తుంటారు. అంతేకాకుండా అంతకంటే చిన్న వారు సైతం వీరిని చూసి ఈ పద్ధతిని నేర్చుకుంటారు. ఇలా చేయడం వల్ల ఎదుటి వారి మనసులో గౌరవం ఇచ్చిన వ్యక్తి పై నమ్మకం పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో కూడా ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. అందువల్ల పెద్దలపట్ల గౌరవం ఇవ్వడం కోసం ఇలా ట క్కున నిల్చోవాలని చెబుతూ ఉంటారు.
Also Read: Shaiva tradition: శైవ సాంప్రదాయం అంటే ఏంటి? ఇందులో మొత్తం ఎన్ని శాఖలు ఉన్నాయంటే?
అయితే నేటి కాలంలో చాలామంది ఇలా నిల్చడం లేదు. దీంతో వారిలో అలసట ఏర్పడి.. క్రమంగా శరీరం మొద్దు బారి పోయినట్లు మారిపోతుంది. అంతేకాకుండా ఎదుటివారికి గౌరవం ఇవ్వకపోవడం వల్ల వారి మనసులో చెడు ప్రభావం ఏర్పడుతుంది. దీంతో భవిష్యత్తులో ఈ వ్యక్తి నమ్మకం లేకుండా ఉండడంవల్ల ఎన్నో రకాలుగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరైనా తమకంటే వయసు పెద్దవారు రాగానే వారికి గౌరవం ఇచ్చి నిల్చుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల ఆయుష్ తగ్గకుండా ఉంటుందని చెబుతుంటారు.