Alasandalu: కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ చూపేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నవధాన్యాలలో అలసందలు ఒకటి కాగా కొన్ని ఏరియాలలో అలసందలను బొబ్బర్లు అనే పేరుతో కూడా పిలుస్తారు. అలసందలలో రెండు రకాలు ఉండగా ఒక రకం అలసందలు తీగ మాదిరిగా అల్లుకుంటే మరో రకం అలసందలు చెట్టు వలె పెరుగుతాయి. అలసందలు తక్కువ ధరకే లభించే ప్రోటీన్ ఉన్న శాఖాహారం కావడం గమనార్హం.

కార్బోహైడ్రేట్లు, మాంసకృత్తులు పుష్కలంగా ఉండే అలసందలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయెని సంగతి తెలిసిందే. అలసందలలో థయామిన్, రైబోఫ్లెవిన్, నియాసిన్ విటమిన్లతో పాటు శరీరానికి అవసరమైన ఫాస్పరస్, కాల్షియం. ఐరన్, మెగ్నీషియం ఉంటాయి. శరీరానికి వీటి వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు. దేశంలో రోజురోజుకు షుగర్ పేషెంట్స్ సంఖ్య పెరుగుతుందనే సంగతి తెలిసిందే.
అలసందలు తినడం వల్ల షుగర్ లెవెల్స్ సాధారణంగా ఉండే అవకాశం ఉంది. మలబద్ధకం సమస్యతో బాధ పడేవాళ్లు అలసందలు తినడం ద్వారా ఆ సమస్య నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. రక్తంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడంలో అలసందలు తోడ్పడతాయి. బరువు తగ్గాలని భావించే వాళ్లకు అలసందలు మంచి ఆహారమని చెప్పవచ్చు. అలసందల వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ తొలగిపోవడంతో పాటు కొన్ని రకాల వ్యాధులు దూరమవుతాయి.
అలసందలు విటమిన్ కెను పుష్కలంగా కలిగి ఉండటంతో పాటు మెదడు చురుకుగా పని చేయడానికి సహాయపడతాయి. అలసందలను రెగ్యులర్ ఆహారంలో చేర్చడం ద్వారా ఇతర ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.