Mahesh Koneru: ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు ఈ రోజు ఉదయం మరణించారు. ఇది టాలీవుడ్ ని దిగ్భ్రాంతికి గురి చేసిన వార్త. ఈ రోజు ఉదయం విశాఖపట్నంలో మహేష్ కోనేరు ఆకస్మిక గుండెపోటు కారణంగా తన తుది శ్వాస విడిచారు. మీడియాలో కంటెంట్ రైటర్ కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన, ఆ తర్వాత మేనేజర్ గా, పీఆర్వోగా ఎదిగారు. స్నేహితుల సహాయంతో నిర్మాతగానూ మారారు. ప్రస్తుతం మహేష్ కోనేరు నిర్మాతగా కళ్యాణ్ రామ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతుంది.

కానీ ఇంతలో ఆయన మరణ వార్త వినడం బాధాకరమైన విషయం. మహేష్ కోనేరు జూనియర్ ఎన్టీఆర్ కి పర్సనల్ మేనేజర్. ఎన్టీఆర్ పీఆర్వోగా ఆయన ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. మహేష్ కోనేరు మరణ వార్త విని ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. తారక్ భావోద్వేగానికి లోనవుతూ.. ‘నా స్నేహితుడు ఇక లేడు అనే వార్త నన్ను చాలా షాక్ గురి చేసింది. ఏం మాట్లాడలేని స్థితిలో ఉన్నాను’ అంటూ తారక్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ఇక మహేష్ కోనేరు కుటుంబానికి తన ప్రఘాడ సానుభూతిని వ్యక్తం చేసాడు. మహేష్ కోనేరు అకాల మరణం టాలీవుడ్ మీడియాతో పాటు సినీ పరిశ్రమకు కూడా తీరని లోటే. ఎందుకంటే మహేష్ కోనేరు నిర్మాతగా వరుసగా మూడు సినిమాలను ప్లాన్ చేశారు. కానీ అంతలో ఆయన ఇలా చనిపోవడం దురదృష్టకరం. మహేష్ కోనేరు మృతి పట్ల పలువురు తెలుగు సినీ ప్రముఖులు కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున మహేష్ కోనేరు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము