GT Vs RR IPL 2025: అయితే ఐపీఎల్ 18వ ఎడిషన్ లో ఇప్పటివరకు ఫీల్డింగ్ గురించి ప్రస్తావన రాలేదు. ఎందుకంటే ఐపీఎల్ అంటేనే దూకుడుకు పరాకాష్ట. ఎదురుదాడికి పర్యాయపదం. అందువల్లే ఇక్కడ ఫీల్డర్లకు ఫీల్డింగ్ చేసే అవకాశం ఉండదనేది అందరికీ ఉన్న ఓ బలమైన అభిప్రాయం. కానీ దానిని తప్పు అని నిరూపించాడు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైస్వాల్.. తన అద్భుతమైన ఫీల్డింగ్ ద్వారా సరికొత్త ప్రమాణాలను సృష్టించాడు. అసలు అతడు పట్టిన క్యాచ్ చూస్తే అంతటి జాంటీ రోడ్స్ కూడా బిత్తర పోతాడు. చివరికి ఆ బంతిని కొట్టిన బ్యాటర్ కూడా సైలెంట్ అయిపోతాడు. అంతలా పట్టాడు మరి ఆ క్యాచ్. న్యూటన్ గమన నియమానికి వ్యతిరేక దిశలో వెళ్తూ.. అసలు గురుత్వాకర్షణ శక్తి అనేది లేదు అన్నట్టుగా నిరూపిస్తూ.. రషీద్ ఖాన్ కొట్టిన ఆ బంతిని అందుకున్నాడు యశస్వి జైస్వాల్. అతడు పట్టిన ఆ క్యాచ్ చూసిన తర్వాత నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు జస్ట్ నోరు వెళ్లబెట్టి ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయారు అంతే..
Also Read: అన్ క్యాప్డ్ ఆటగాడు.. 6 బంతులకు ఆరు సిక్సర్ల మొనగాడు.
అద్భుతంగా అందుకున్నా
రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో.. జట్టు స్కోరు 19.5 ఓవర్లకు 200 పరుగులకు చేరుకుంది. ఆ దశలో రషీద్ ఖాన్ బ్యాటింగ్ చేస్తున్నాడు.. బౌలింగ్ తుషార్ దేశ్పాండే వేస్తున్నాడు. అప్పటికే రషీద్ ఖాన్ నాలుగు బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ తో 12 పరుగులు చేశాడు. ఈ దశలో తుషాప్ దేశ్పాండే ఆఫ్ సైడ్ వేసిన బంతిని రెండు కాళ్ళ సందుల్లో బ్యాట్ ను చాకచక్యంగా ఊపి షాట్ కొట్టడానికి రషీద్ ఖాన్ ప్రయత్నించాడు. అయితే లెగ్ సైడ్ దిశగా లేచిన ఆ బంతిని.. యశస్వి జైస్వాల్ అద్భుతంగా అందుకున్నాడు. ఏమాత్రం పొరపాటుకు అవకాశం లేకుండా బంతిని తన రెండు చేతుల్లో అమాంతం జాగ్రత్తగా పట్టుకున్నాడు. దీంతో రషీద్ ఖాన్ నిరాశతో వెళ్లిపోయాడు. ఈ క్యాచ్ మ్యాచ్ మొత్తానికే కాదు.. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లకే హైలెట్ గా నిలిచింది. అంతేకాదు రషీద్ ఖాన్ క్యాచ్ ను పట్టుకున్న యశస్వీ జైస్వాల్ ఒకప్పటి జాంటీ రోడ్స్ ను గుర్తుకు తెచ్చాడని అభిమానులు అంటున్నారు..” జైస్వాల్ అద్భుతంగా బంతిని అందుకున్నాడు. అలా బంతిని అందుకోవాలంటే చాలా ఓర్పు ఉండాలి. నేర్పు కూడా ఉండాలి. దానిని జైస్వాల్ ప్రదర్శించాడని” రాజస్థాన్ రాయల్స్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read: మెరుపు స్టంప్ ఔట్ .. ధోనిని గుర్తుచేసిన సంజు శాంసన్..
A STUNNER FROM JAISWAL
– One of the best fielder in India currently. pic.twitter.com/ZlR0efb6sB
— Johns. (@CricCrazyJohns) April 9, 2025