https://oktelugu.com/

Green Matar: వారానికొకసారి గ్రీన్ మటర్ తింటే.. ఈ సమస్యలన్నీ పరార్

ఆరోగ్యానికి పచ్చి బఠానీ ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఎక్కువగా పనీర్, బిర్యానీ వంటి వంటల్లో ఉపయోగిస్తారు. అయితే ఈ పచ్చి బఠానీ ఎక్కువగా శీతాకాలంలో లభిస్తుంది. వీటి వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలామందికి తెలియదు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 17, 2024 / 05:35 AM IST

    green matar

    Follow us on

    Green Matar: ఆరోగ్యానికి పచ్చి బఠానీ ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఎక్కువగా పనీర్, బిర్యానీ వంటి వంటల్లో ఉపయోగిస్తారు. అయితే ఈ పచ్చి బఠానీ ఎక్కువగా శీతాకాలంలో లభిస్తుంది. వీటి వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలామందికి తెలియదు. ఇవి కేవలం మీ ఆహార రుచిని పెంచడమే కాకుండా.. శరీర ఆరోగ్యానికి కూడా మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే పోషకాలు అనేక దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటి ఖరీదు కూడా మరీ ఎక్కువ లేదా తక్కువగా ఉండదు. మధ్య తరగతి వారు కూడా కొనే విధంగా ఉంటుంది. కనీసం వారానికి లేదా 15 రోజులకు ఒకసారి అయిన వీటిని తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఈ గ్రీన్ మటర్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    బరువు నియంత్రణ
    పచ్చి బఠానీలు తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. దీంతో మీరు ఈజీగా బరువు తగ్గుతారు. ఇందులో ఎక్కువగా ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బరువు తగ్గడానికి పచ్చి బఠానీలతో సూప్ కూడా చేసి తాగవచ్చు. ముఖ్యంగా చలికాలంలో చేసి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

    కండరాలు బలంగా..
    పచ్చి బఠానీలో ఉండే పోషకాలు కండరాలను బలంగా చేస్తాయి. శరీరానికి అవసరమైన అన్ని రకాల ప్రోటీన్లు ఇందులో ఉంటాయి. అర కప్పు బఠానీలో దాదాపుగా 4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కేవలం ప్రొటీన్ మాత్రమే కాకుండా ఐరన్, ఫాస్పరస్, ఫోలేట్, విటమిన్ ఎ, కె, సి వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి కండరాలను బలాన్ని చేకూరుతాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.

    మధుమేహం
    బఠానీలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇందులోని ఫైబర్ ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేస్తాయి. వీటిని మధుమేహం ఉన్నవారే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు వారానికి ఒకసారి అయిన తినడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందుతారు.

    జీర్ణ క్రియ ఆరోగ్యం
    బఠానీలలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని ఫైబర్ ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. అలాగే ప్రేగు వ్యాధి, మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

    గుండె ఆరోగ్యం
    గ్రీన్ బఠానీలో మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి మీ గుండెకు మేలు చేయడంతో పాటు అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. పచ్చి బఠానీలలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.