Baba Vanga : బాబా వంగా, అంధ బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త. తూర్పు, పశ్చిమల మధ్య విపత్కర యుద్ధంతో సహా 2025 కోసం కొన్ని అంచనాలు వేశారు. అవి చాలా వరకు నిజం అవుతుండటంతో ఈ బాబాను నమ్మేవారు చాలా ఎక్కువగానే ఉన్నారు. అయితే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారి కాలజ్ఞానాన్ని ఎంత మంది నమ్ముతున్నారో అదే విధంగా ఈ బాబా వంగ చెప్పిన అంచనాలను కూడా నమ్ముతున్నారు ప్రజలు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. అయితే ఈ బాబా ముందు కూడా ఇదే మాదిరిగా చెబితే ఎవరూ పట్టించుకోలేదు. కానీ బాబా చెప్పే మాటలు నిజం అవుతుండటంతో వారి గురించి సెర్చ్ చేయడం కూడా మొదలు పెట్టారు ప్రజలు. ఇక మొత్తం మీద ఈ 2025 లో ఎలాంటి పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి అని బాబా తెలిపారో తెలుసా? అయితే ఓ సారి ఈ ఆర్టికల్ ను చదివేసేయండి.
సిరియా పతనం ప్రపంచ సంఘర్షణను రేకెత్తిస్తుందని, ఇది మూడవ ప్రపంచ యుద్ధంలో పశ్చిమ దేశాలను నాశనం చేస్తుందని వంగా ఊహించారు. వసంతకాలంలో తూర్పు యుద్ధాన్ని ప్రారంభిస్తుందని, ఇది చివరికి పాశ్చాత్య ప్రపంచాన్ని నాశనం చేస్తుందని అంచనా వేశారు. తన ప్రవచనాలలో ఒకదానిలో, బాబా వంగా సిరియా విజేతకు వస్తుందని పేర్కొన్నారు. కానీ విజేత నిజంగా విజయం సాధించాడు అని కూడా తెలిపారు వంగా. గ్రహాంతర జీవితంతో మానవాళికి గల సంభావ్య సంబంధాన్ని గురించి కూడా ఆధ్యాత్మికవేత్త హెచ్చరించాడు. ఇది ప్రపంచ సంక్షోభాన్ని లేదా అపోకలిప్స్‌ను కూడా ప్రేరేపిస్తుంది.
గ్రహాంతరవాసుల ఎన్‌కౌంటర్ల గురించి వంగా జోస్యం దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో US ప్రభుత్వ ఫైళ్లను విడుదల చేయడంతో తన గురిచి మరింత ఇంట్రెస్ట్ రేకెత్తించింది. 2025లో గ్రహాంతర వాసులతో మానవులకు కాంటాక్ట్ ఏర్పడవచ్చని బాగా వంగా చెప్పినా ఈ వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ పరిణామం బహుశా ప్రపంచ సంక్షోభానికి లేదా అంతానికి దారి తీయవచ్చు అని కూడా ఆమె హెచ్చరించారు. అయితే గ్రహాంతర వాసులకు సంబంధించిన అన్ని ఫైల్స్‌ను విడుదల చేస్తానని రీసెంట్ గా డొనాల్డ్ ట్రంప్ వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ జోస్యానికి ప్రాధాన్యత ఏర్పడింది.
2025 నాటికి టెలిపతి అనేది ఒక వాస్తవికతగా మారుతుందని, మానవులు తమ మనస్సు ద్వారా నేరుగా కమ్యూనికేట్ చేయడానికి వీలు కల్పిస్తుందని తను అంచనా వేశారు. టెలిపతి గురించి వంగా చెప్పిన ఈ దూరదృష్టి మెదడు-చిప్ సాంకేతికతలో ఎలోన్ మస్క్ పురోగతికి అనుగుణంగా ఉంటుంది.
బాబా వంగా 2025లో, ముఖ్యంగా నానో టెక్నాలజీ, టెలిపతిలో గణనీయమైన శాస్త్రీయ, వైద్య పురోగతులను ముందే ఊహించారు. అయినప్పటికీ, ఈ సాంకేతికతలను దుర్వినియోగం చేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి ఆమె హెచ్చరించింది. సంభావ్య విపత్తు పరిణామాలను సూచిస్తుంది.