UPI transactions : ఒకప్పుడు షాప్ కి వెళ్లాలంటే డబ్బులు తీసుకొని వెళ్లేవారు. ఇప్పుడు ఫోన్ తీసుకొని వెళ్తున్నారు. అప్పుడు చిల్లరతో ప్రాబ్లం అయితే ఇప్పుడు కాస్త నెట్ తో ప్రాబ్లం. కానీ లిక్విడ్ క్యాష్ కంటే ఈ డిజిటల్ పేమెంట్స్ వల్ల ప్రజలు చాలా టెన్షన్ ఫ్రీగా ఉన్నారు. కానీ డబ్బు కూడా అదే రేంజ్ లో ఖర్చు పెడుతున్నారు. స్కాములు చేస్తున్నారు. ఫ్రెండ్స్, రిలేషన్స్ కు కాల్ చేసి డబ్బులు వేయమనగానే నిమిషాల్లో డబ్బులు వచ్చి పడుతున్నాయి. ఇలా డబ్బులు కూడా చాలా ఖర్చు చేసేస్తున్నారు. అయితే నెట్ లేకుండా మాత్రం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసే వీలు లేదు. దీని వల్ల చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు నెట్ లేకుండా కూడా ఈ ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు. ఎలాగంటే?
డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పల్లెల్లో కూడా కామన్ గా జరుగుతున్న విషయం తెలిసిందే. చదవడం రాని వారికి కూడా ఈ Upl లావాదేవీలు చాలా సులభంగా చేసేయవచ్చు. నేర్చుకొని మరీ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. ఎలాంటి వస్తువు కొనుగోలు చేసినా సరే ఫోన్ పే, గూగుల్ పే లు ఉపయోగిస్తారు. మనీ వాడటం మొత్తం తగ్గించేవారు. డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగడంతో RBI ఇప్పటికే కొత్త నియమాలు ప్రకటించింది. అవన్నీ కొత్త సంవత్సరం 2025లో జనవరి 1 నుంచి అమలు అవుతాయి అంటున్నారు ఆర్బీఐ.
జనవరి 1 నుంచి ఈ UPI చెల్లింపు లావాదేవీల పరిమితి పెరిగనుంది. ప్రస్తుతానికి UPI చెల్లింపు పరిమితి రూ.5,000 గా మాత్రమే ఉంది. అయితే జనవరి 1 నుంచి రూ.10,000 వరకు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఈ అవకాశం కల్పించనున్నారు. RBI ఇప్పటికే ఈ కొత్త నియమాన్ని ప్రకటించింది. అయితే బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు ఈ నియమాలను పాటించడానికి కస్టమర్లకు సేవలు అందించడానికి గడువు తీసుకున్నారు. ఇప్పుడు జనవరి 1 నుంచి రూ.10,000 వరకు లిమిట్ పెంపు సౌకర్యం కూడా అమలు చేస్తారట.
UPI 123Pay మార్పులు చేసింది. అంతేకాదు RBI UPI లైట్ వాలెట్ల కోసం పరిమితులను కూడా పెంచింది. వాలెట్ బ్యాలెన్స్ పరిమితి రూ. 2,000 నుంచి రూ. 5,000కి పెంచారు. ప్రతి లావాదేవీ పరిమితి రూ. 500 నుండి రూ. 1,000 వరకు పెంచారు. జనవరి 1 నుంచి ఈ కొత్త నియమాలను అమలు చేస్తారట. ఈ విషయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ నిర్ణయించింది. జనవరి 1 నుంచి కొత్త UPI చెల్లింపు లావాదేవీ పరిమితిని పాటించాలని సూచించింది బ్యాంకులకు సూచించింది.
జనవరి 1 నుంచి UPI చెల్లింపు పరిమితులే కాదు.. మరికొన్ని కొత్త రూల్స్ కూడా అమలులోకి రానున్నాయి. UPI 123 Pay ద్వారా లావాదేవీలు చేస్తే ఇక నుంచి ఛార్జీలు కూడా ఉండవు. దీని వల్ల ప్రజలకు చాలా ఉపయోగకరం కూడా. ఇక ఈ ఫీచర్ వల్ల మీరు చేసే డిజిటల్ చెల్లింపులు సులభతరం అవుతాయి. వినియోగదారులు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఈ సేవలను వాడుకోవచ్చు. ఈ వీలు కల్పిస్తుంది. అంటే IVR ద్వారా చెల్లించవచ్చు అన్నమాట. జనవరి 1 నుంచి అమలులోకి రానున్న మరో కొత్త రూల్ ఏంటో మీకు తెలుసా? అదేనండి పాన్ కార్డ్‌తో ఆధార్ కార్డ్ లింక్ చేయడం మస్ట్.