https://oktelugu.com/

Breast Implant: బ్రెస్ట్ ఇంప్లాంట్‌మెంట్ చేయించుకుంటున్నారా.. ఏది మంచిది?

కొందరు మహిళలు రొమ్ములు పెద్దగా కావాలని సర్జరీ చేయించుకోవడం, మందులు వాడటం వంటివి చేస్తారు. మరికొందరు బ్రెస్ట్ ఇంప్లాంట్లు చేయించుకుంటారు. మరి వీటిని చేయించుకోవడం ఎలా? ఇవి మహిళలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 11, 2024 / 03:31 PM IST

    21724-breast-implants-1300316377

    Follow us on

    Breast Implant: సరైన శరీర ఆకృతి ఉండాలని, అందరిలో అందంగా కనిపించాలని చాలామంది అమ్మాయిలు కోరుకుంటారు. దీనికోసం ఆర్టిఫిషియల్‌గా కూడా అందంగా కనిపించాలని ప్లాన్ చేస్తారు. ఇలాంటి వాటివల్ల ఆ నిమిషానికి అందంగా కనిపించిన సరే.. తర్వాత ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొవలసి వస్తుంది. అయితే కొంతమందికి రొమ్ములు చాలా చిన్నగా ఉంటాయి. దీంతో అందంగా కనిపించమనే భావనలో ఆర్టిఫిషియల్‌గా బ్రెస్ట్ ఇంప్లాంట్లు చేయించుకుంటారు. సిలికాన్ బ్రెస్ట్ ఇంప్లాంట్లు చేయించుకోవడం వల్ల బాడీ షేప్ కనిపిస్తుందని, అందరిలో అందంగా కనిపిస్తారని భావిస్తారు. కేవలం వీరే కాకుండా రొమ్ము క్యాన్సర్ బారిన పడిన వారు కూడా ఎక్కువగా ఈ బ్రెస్ట్ ఇంప్లాంట్లు చేయించుకుంటారు. ఎందుకంటే రొమ్ము క్యాన్సర్ వచ్చిన తర్వాత కొందరికి సర్జరీ ద్వారా రొమ్ములను తొలగిస్తారు. వీటిని తొలగించిన తర్వాత మహిళలు వారిలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారట. కొందరు రొమ్ములు పెద్దగా కావాలని సర్జరీ చేయించుకోవడం, మందులు వాడటం వంటివి చేస్తారు. మరికొందరు ఇలా బ్రెస్ట్ ఇంప్లాంట్లు చేయించుకుంటారు. మరి వీటిని చేయించుకోవడం ఎలా? ఇవి మహిళలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

     

    సిలికాన్‌తో కృత్రిమంగా తయారు చేసి బ్రెస్ట్ ఇంప్లాంట్లు చేయిస్తారు. సెలైన్ ద్రావణం, సిలికాన్ జెల్‌తో వీటిని రొమ్ములను చేస్తారు. వీటిని పెట్టుకున్న తర్వాత దాదాపుగా 10 ఏళ్ల వరకు ఉంటాయట. అయితే కొందరికి ఎక్కువ రోజులు అయితే ఇవి చీలిబడిపోతాయి. ఇలా చీలే ముందు కొందరిలో లక్షణాలు కనిపిస్తాయి. కానీ మరికొందరిలో అవేం కనిపించవు. అయితే ఇందులో నాణ్యత గలవి కూడా ఉంటాయి. సెలైన్ బ్రెస్ట్ ఇంప్లాంట్లు కంటే సిలికాన్ బ్రెస్ట్ ఇంప్లాంట్లు సహజంగా ఉండటంతో పాటు ఎక్కువ రోజులు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సిలికాన్ బ్రెస్ట్ ఇంప్లాంట్లును గమ్మీ బేర్ మిఠాయి అని కూడా అంటారు. వీటిని ధరించాలంటే కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. కానీ 22 ఏళ్ల తర్వాత వారికే ఈ సిలికాన్ బ్రెస్ట్ ఇంప్లాంట్లును సిఫార్సు చేస్తారు. ఈ ప్రక్రియ ప్రారంభించే ముందు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేస్తారు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్నారా? లేదా? అని చెక్ చేసిన తర్వాతే దీనిని ప్రారంభిస్తారు. అయితే ఇవి చాలా సురక్షితమైవని వైద్య నిపుణులు చెబుతున్నారు.

    బ్రెస్ట్ ఇంప్లాంట్లు వల్ల రొమ్ములు అందంగా కనిపించడమే కాకుండా నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా శస్త్ర చికిత్స సమయంలో రక్తస్రావం అధికంగా అవుతుంది. ఆ తర్వాత ఇంప్లాంట్లు గట్టి పడటంతో పాటు దీర్ఘకాలికంగా సమస్యలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా బ్రెస్ట్ ఇంప్లాంట్లు చేయించుకున్న కొందరు బ్రెస్ట్ ఫీడింగ్ చేయగలరు. కానీ మరికొందరు పూర్తిగా బ్రెస్ట్ ఫీడింగ్ చేయలేరు. ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత కొన్ని రోజులు శారీరక శ్రమకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా బరువులు ఎత్తడం, దించడం వంటివి చేయకూడదు. దాదాపుగా 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఇది చేయించుకునే ముందు నిపుణుల సలహా తీసుకోగలరు.