Viswam Collection: అనేక ప్రాంతాల్లో ‘విశ్వం’ మార్నింగ్ షోస్ రద్దు..గోపీచంద్ కెరీర్ లోనే డిజాస్టర్ ఓపెనింగ్..ఇక కష్టమే!

'భీమా' కి డీసెంట్ స్థాయి ఓపెనింగ్ వసూళ్లు అయినా వచ్చాయి, కానీ 'విశ్వం' కి కనీస స్థాయి ఓపెనింగ్స్ కూడా దక్కలేదు. అనేక ప్రాంతాలలో మార్నింగ్ షోస్ కి జనాలు లేక క్యాన్సిల్ కాబడ్డాయి. అసలే ఓపెనింగ్స్ లేవని బయ్యర్స్ బాధపడుతుంటే కొన్ని చోట్ల లైసెన్స్ సమస్యలు రావడంతో షోస్ ని క్యాన్సిల్ చేసారు. అలా దారుణమైన మార్నింగ్ షోస్ తో ప్రారంభం అయ్యింది ఈ చిత్రం.

Written By: Vicky, Updated On : October 11, 2024 4:47 pm

Viswam Collection

Follow us on

Viswam Collection: చాలా కాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక మార్కెట్ మొత్తాన్ని పూర్తిగా కోల్పోయిన హీరోలలో ఒకరు గోపీచంద్. విలన్ గా ఒక రేంజ్ లో పాపులర్ అయిన ఈయన, ఆ తర్వాత హీరో గా మారి ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు అందుకొని మాస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించాడు. అయితే ఆ ఫాలోయింగ్ ని ఈయన ఎక్కువ కాలం నిలబెట్టుకోలేదు. వరుసగా చెత్త స్క్రిప్ట్స్ ని ఎంచుకొని డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకున్నాడు. మార్కెట్ బాగా దెబ్బ తినడంతో ఈయన నుండి విడుదలైన కొన్ని మంచి సినిమాలకు కూడా వసూళ్లు రాలేదు. ఆయన గత చిత్రం ‘భీమా’ కి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి, కానీ కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు ఆయన శ్రీను వైట్ల దర్శకత్వం లో ‘విశ్వం’ అనే చిత్రం ద్వారా మన ముందుకు వచ్చాడు.

‘భీమా’ కి డీసెంట్ స్థాయి ఓపెనింగ్ వసూళ్లు అయినా వచ్చాయి, కానీ ‘విశ్వం’ కి కనీస స్థాయి ఓపెనింగ్స్ కూడా దక్కలేదు. అనేక ప్రాంతాలలో మార్నింగ్ షోస్ కి జనాలు లేక క్యాన్సిల్ కాబడ్డాయి. అసలే ఓపెనింగ్స్ లేవని బయ్యర్స్ బాధపడుతుంటే కొన్ని చోట్ల లైసెన్స్ సమస్యలు రావడంతో షోస్ ని క్యాన్సిల్ చేసారు. అలా దారుణమైన మార్నింగ్ షోస్ తో ప్రారంభం అయ్యింది ఈ చిత్రం. సాధారణంగా ప్రతీ సినిమాకి సోషల్ మీడియా లో పాజిటివ్ లేదా నెగటివ్ టాక్ రావడం మనం చూస్తుంటాము. కానీ ఈ చిత్రానికి ఏ టాక్ కూడా రాకపోవడం గమనార్హం. ఎందుకంటే ఎవ్వరూ థియేటర్స్ కి వెళ్ళలేదు కాబట్టి టాక్ కూడా బయటకి రాలేదు. కొన్ని వెబ్ సైట్స్ పాజిటివ్ రివ్యూస్ ఇచ్చాయి. శ్రీను వైట్ల మార్క్ రొటీన్ సినిమా అయ్యినప్పటికీ కొన్ని కామెడీ బ్లాక్స్ బాగా వర్కౌట్ అయ్యాయని, ప్రేక్షకులను నవ్వించాయని చెప్పుకొచ్చారు.

కానీ ఆ ట్వీట్స్ ని చూస్తుంటే నిర్మాతలు డబ్బులిచ్చి వేయించినట్టుగా ఉన్నాయి. చూస్తుంటే ఈ చిత్రానికి మొదటి రోజు కోటి రూపాయిల షేర్ వసూళ్లు కాదు కదా, కనీసం గ్రాస్ వసూళ్లు కూడా వచ్చేలా కనిపించడం లేదు. ఈ వసూళ్లు చూసిన తర్వాత గోపీచంద్ పేరు మీద ఇక టిక్కెట్లు అమ్ముడుపోవడం కష్టం అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇక హీరో రోల్స్ కి గోపీచంద్ పనికారడని, మళ్లీ విలన్ గా రీ ఎంట్రీ ఇస్తే ఆయన కెరీర్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటుందని, పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారిపోతాడని అంటున్నారు. ఇప్పటికే బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ లో రాబోయే సినిమాలో గోపీచంద్ విలన్ రోల్ కి ఎంపిక అయ్యాడని సోషల్ మీడియా లో ఒక టాక్ గత కొంతకాలం గా వినిపిస్తుంది . ఒకవేళ నిజం అయితే గోపీచంద్ కి మహర్దశ ప్రారంభం అయ్యినట్టే.