Fingers: శాస్త్రం ప్రకారం మన భవిష్యత్తు మన చేతి వేళ్ళ పై ఆధారపడి ఉంటుందని పండితులు చెబుతారు.ఈ క్రమంలోనే చాలామంది మన చేతి వేళ్లను బట్టి మన భవిష్యత్తు మనస్తత్వం ఎలాంటిదో చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరికి ఒక్కో విధమైన మనస్తత్వం ఉన్నట్టే చేతి వేళ్ళు కూడా ఉంటాయి. మరి మీ చేతి వేళ్ళు ఎలా ఉంటే మీ మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం…

మన చేతి చూపుడు వేలు ఎప్పుడూ కూడా మధ్య వేలు స్టార్టింగ్ దగ్గర వరకు ఉంటే అలాంటివారు ఆధిపత్యం చెలాయిస్తారు. ఇలాంటి వారికి కోపం ఎక్కువగా ఉండడమే కాకుండా అహంకారం కూడా ఉంటుంది. చూపుడు వేలు మధ్య వేలుకన్న పెద్దగా ఉంటే వారికి చాలా అహంకారం ఉంటుంది. అందరికన్నా నేనే గొప్ప అనే భావనలో ఉంటారు. అన్ని వేళ్లతో పోలిస్తే చూపుడు వేలు చిన్నగా ఉంటే అలాంటి వారికి ఎక్కువ ఆశ ఉంటుంది. ఏ పని చేసిన అలాంటివారు ఆ పనిలో ఆనందాన్ని కోరుకుంటారు.
Also Read: జగన్ ను ఇరుకున పెట్టిన కేసీఆర్

ఇక ఉంగరం వేలు కన్నా చూపుడు వేలు పొడవుగా ఉన్న వారు ఎక్కువ ఆశ పరులు. వీరు ప్రతి విషయంలోను అత్యుత్సాహం చూపుతూ చేయవలసిన పనిని కూడా నాశనం చేస్తుంటారు. ఒకవేళ చూపుడు వేలు ఉంగరం వేలు కన్నా పొట్టిగా ఉంటే అలాంటి వారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎంతో ప్రశాంతంగా ఉండటమే కాకుండా మన అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుందని భావిస్తారు.
Also Read: మరోసారి ‘చలో విజయవాడ’: ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన టీచర్లు