ఆంధ్రప్రదేశ్లో మరోసారి ప్రత్యేక హోదా చర్చ సీరియస్ గా సాగుతోంది. ఇటీవల కేంద్రం ఈ అంశాన్నిలేవనెత్తడంతో రాజకీయ పార్టీలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారా..? ఇవ్వరా..? అనే కోణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారే సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో ‘స్పెషల్ స్టేటస్’ పేరు ట్రెండ్ అవుతోంది. ఏపీలో ఈ అంశంపై పట్టించుకోని తరుణంలో ‘ప్రత్యేక హోదా’ను కేంద్రం ఎందుకు తెరపైకి తీసుకొచ్చింది..? రాజకీయ లబ్ధి కోసమేనా..? లేకా 2019 సీన్ రిపీట్ చేయడానికా..? అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక వేళ రాజకీయ లబ్ధి కోసమే అయితే ఇప్పుడు అధికార పార్టీకి మైనస్ కానుందా..? అనేది హాట్ టాపిక్ గా మారింది.

కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏడేళ్ల పాటు రెండు రాష్ట్రాల మధ్య జరిగిన విభజన సమస్యలపై పట్టించుకోలేదు. కానీ ఇటీవల అనూహ్యంగా విభజన సమస్యలు పరిస్కరిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా ఈనెల 17న రెండు రాష్ట్రాల సీఎస్ లు హాజరు కావాలని రెండు రాష్ట్రాలకు లేఖలు పంపారు. అయితే ఈ లేఖలో ముందుగా ప్రత్యేక హోదా అంశంపై కూడా చర్చిస్తామని పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీకి సంబరాలు చేసుకున్నంత పనైయింది. వెంటనే కొందరు అధికార పార్టీ లీడర్లు ఈ విషయాన్ని తమకు అనుగుణంగా మార్చుకున్నారు. ఈ ఘనత తమదేనంటూ ప్రెస్ మీట్లు పెట్టారు. గతంలో టీడీపీ చేసిన తప్పును మేం సరిదిద్దుతున్నామని చెప్పుకొచ్చారు.
అయితే కేంద్రం చాకచక్యంగా ‘ప్రత్యేక హోదా’ అంశాన్ని సాయంత్రం వరకు తీసేసింది. కొందరు రాజకీయ నాయకులు పొరపాటున ఈ అంశాన్ని చేర్చామని అన్నారు. దీంతో అప్పటి వరకు జోష్లో ఉన్న వైసీపీ నాయకులపై నీళ్లు చల్లినట్లయింది. దీంతో బీజేపీ పై విమర్శలు చేస్తూ వచ్చారు. అంతేకాకుండా ఇదంతా టీడీపీ చేయిస్తున్న కుట్రే అని కొందరు ఆరోపించారు. వాస్తవానికి ప్రత్యేక హోదా నినాదంతోనే వైసీపీ అధికారంలోకి వచ్చింది. కేంద్రం ఈ అంశంపై చర్చ పెడితే పెద్ద ఎత్తున లాభం చేకూరేది.కానీ ఒక్కసారిగా దానిని తొలగించడంతో మరోసారి వైసీపీ నాయకులు నిరాశ చెందారు.
ఇక ప్రతిపక్ష టీడీపీ ఉదయం కాస్త నిరాశ చెందినా.. సాయంత్రం వరకు ఊపిరి పీల్చుకున్నట్లే తెలుస్తోంది. ఒకవేళ ప్రత్యేక హోదాపై చర్చ జరిగితే టీడీపీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులు రాష్ట్రానికి తీసుకొస్తామని చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. ఇప్పడు ప్రత్యేక హోదా ఇస్తే చంద్రబాబు విలన్ గా మారే ప్రమాదముందని కొందరు టీడీపీ నాయకులు భావించారు. దీంతో కేంద్రం సాయంత్రం తీసుకున్న నిర్ణయంతో టీడీపీ నాయకులకు మేలు జరిగిందని గుసగుసలాడుకుంటున్నారు.
ఇదిలా ఉండగా 2019లో ప్రత్యేక హోదా నినాదంతో వైసీపీ అధికారంలోకి రాగా.. టీడీపీకి భారీ దెబ్బ పడింది. దీంతో ఈ అంశాన్ని కేంద్రం లేవనెత్తడంపై రాజకీయంగా దుమారం లేపినట్లయింది. దీంతో కేంద్రం ఏం చేయబోతుంది..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరో రెండేళ్లలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయంగా అలజడి సృష్టించడానికేనా..? అని కొందరు అంటున్నారు. అయితే ఈనెల 17న నిర్వహించేచర్చల ద్వారా అసలు విషయం బయటకొస్తుందని భావిస్తున్నా.. ఇది కచ్చితంగా రాజకీయ లబ్దేనని కొందరు వాదిస్తున్నారు.
[…] Also Read: కేంద్రం తెరపైకి ‘ప్రత్యేక హోదా’ అంశం… […]
[…] Also Read: కేంద్రం తెరపైకి ‘ప్రత్యేక హోదా’ అంశం… […]