https://oktelugu.com/

WI-FI Password: చాలా మంది ఎక్కువగా పెట్టుకొనే WI-FI పాస్ వర్డ్ ఇదే.. మీరు కూడా పెట్టుకుంటే వెంటనే మార్చేయండి!

WI-FI Password: ప్రస్తుతకాలంలో స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ ఉపయోగించే వారి సంఖ్య అధికం అయ్యింది. ఈ క్రమంలోనే చాలామందికి రోజుకు ఎక్కువ సంఖ్యలో ఇంటర్నెట్ ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక చాలామంది ఈ విషయాన్ని ఆసరాగా తీసుకొని వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ లో ఫ్రీ వైఫై అనే బోర్డ్ మనకు దర్శనమిస్తుంది.ఇలాంటి బోర్డు కనిపించగానే ఏ మాత్రం ఆలోచించకుండా చాలామంది అలాంటి రెస్టారెంట్ కి వెళ్లడం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 14, 2022 / 12:46 PM IST
    Follow us on

    WI-FI Password: ప్రస్తుతకాలంలో స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ ఉపయోగించే వారి సంఖ్య అధికం అయ్యింది. ఈ క్రమంలోనే చాలామందికి రోజుకు ఎక్కువ సంఖ్యలో ఇంటర్నెట్ ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక చాలామంది ఈ విషయాన్ని ఆసరాగా తీసుకొని వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ లో ఫ్రీ వైఫై అనే బోర్డ్ మనకు దర్శనమిస్తుంది.ఇలాంటి బోర్డు కనిపించగానే ఏ మాత్రం ఆలోచించకుండా చాలామంది అలాంటి రెస్టారెంట్ కి వెళ్లడం మనం చూస్తుంటాము.

    WI-FI Password

    ఇకపోతే చాలామంది ఇలాంటి రెస్టారెంట్స్ దరిదాపులకు వెళ్లి వైఫై ఆన్ చేయడం కోసం వారికి తోచిన పాస్వర్డ్ కొడుతూ కనెక్ట్ అవుతుందేమోనని ఆశగా ఎదురు చూస్తుంటారు. ఇలా ఎక్కువ మంది ఉపయోగించే పాస్ వర్డ్ గురించి చిన్న రీసెర్చ్ చేయడంతో మన ఇండియాలో చాలా మంది పెట్టుకొనే టాప్ టెన్ పాస్ వర్డ్స్ గురించి తెలియ చేశారు.మరి ఆ పాస్ వర్డ్స్ కనుక మీరు కనుక పెట్టుకొని ఉంటే వెంటనే వాటిని తొలగించండి లేదంటే మీ ఇంటర్నెట్ మొత్తం అయిపోతుంది మరి ఆ పాస్వర్డ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…

    Also Read: థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు అంద‌రిని కూడ‌గ‌డుతున్న కేసీఆర్?

    అన్నిటికన్నా ముందుగా టాప్ వన్ లో ఉన్న పాస్వర్డ్ ఏమిటంటే నంబర్స్ 12345 అని లైన్ గా పెట్టుకోవడం. ఇలా పెట్టుకోవడం వల్ల గుర్తు ఉంటుందని చాలా మంది భావిస్తారు. ఇక చాలామంది ఇదే నెంబర్ ను రివర్స్ లో కూడా పెట్టుకుంటారు. ఇక ఈ సర్వేలో భాగంగా మరికొంతమంది కొన్ని ఆల్ఫాబెట్స్… మరికొన్ని నెంబర్స్ (ABC….123) ఇలా పాస్వర్డ్ పెట్టుకున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ఇక భగ్న ప్రేమికులు ఏ దేనికైనా పాస్వర్డ్ ఐ లవ్ యు అని పెట్టుకుని ఉంటారు. ఇక మరికొందరు వారి పాస్వర్డ్ మర్చిపోకూడదని అన్ని సున్నాలు పెట్టుకొని ఉంటారు.మరి కొందరు వారి సర్ నేమ్ లేదా వారి పేరును పాస్వర్డ్ గా పెట్టుకోవడం మరి కొందరు వారి ఫోన్ నెంబర్ ను పాస్వర్డ్ పెట్టుకోవడం చేస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.ఇకపోతే చాలా మంది వారి మొబైల్ ఫోన్ కి వారే వెల్కమ్ చెబుతూ వెల్కమ్ అనే పాస్వర్డ్ కూడా పెట్టుకొని ఉంటారు.ఇలాంటి పాస్వర్డ్ కనుక మీరు కనుక పెట్టుకొని ఉంటే వెంటనే వాటిని మార్చండి లేదంటే మన ఇంటర్నెట్ మొత్తం ఉపయోగించుకొనే వారు కూడా ఉంటారు.

    Also Read: కేసీఆర్ కొత్త పార్టీపై సర్వేలు..! ప్రజలేమనుకుంటున్నారు..?