
వైఎస్సార్ రైతు భరోసా, నివర్ తుపాన్ నష్ట పరిహారంపై అధిష్ఠానంతో చర్చించామని మంత్రి అవంతి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పదకొండు రూపాల్లో రైతులను అదుకుంటున్నామని ప్రకటించారు. పదమూడు జిల్లాల్లోని రైతులు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సంతోషంగా ఉన్నారని చెప్పారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇళ్ల పట్టాల విషయంలో అవినీతి జరిగితే నిరూపించాలని సవాల్ విసిరారు. ఇళ్ల పట్టాల్లో సమస్య వస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. తొంభై రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని హామీ ఇచ్చారు.