https://oktelugu.com/

Today horoscope in telugu : హోళికా దహనం వేళ.. ఈ రాశుల వారికి ఈరోజు లక్ష్మీనారాయనుడి అనుగ్రహం..

Today horoscope in telugu : అప్పుల నుంచి బయటపడేందుకు మార్గం దొరుకుతుంది. దీంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెడతారు.

Written By:
  • NARESH
  • , Updated On : March 13, 2025 / 08:22 AM IST
    Horoscope Today(14)

    Horoscope Today(14)

    Follow us on

    Today horoscope in telugu : గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశరాశిలపై పూర్వ పాల్గుని నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడింది. నీతో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారికి ఈ రోజు పెండింగ్ పనులు పూర్తవుతాయి. దీంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. ప్రైవేటు ఉద్యోగం చేసే వారికి అదనపు జీతం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

    వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో ప్రత్యేక గుర్తింపును పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులకు నగదు కొరత ఏర్పడినప్పటికీ ఇబ్బందులు ఉండవు. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. విహార యాత్రలకు వెళ్లేందుకు ప్లాన్స్ ఇస్తారు.

    మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈరోజు వివిధ కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. గతంలో చేపట్టిన పనులను ఇప్పుడో పూర్తి చేస్తారు. ఆగిపోయిన ఆదాయం తిరిగి వస్తుంది. అర్హులైన వారికి వివాహ సంబంధాలు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే ఈరోజు వారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఓ పార్టీలో పాల్గొంటారు. పాత స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.

    కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈరోజు వారు ఈరోజు స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వివిధ భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టులో ఏమైనా కేసు పెండింగ్లో ఉంటే ఈరోజు అనుకూలంగా తీర్పు వస్తుంది. విహారయాత్రలకు వెళ్లేవారు పర్యటనలు వాయిదా వేసుకోవాలి. అదనపు ఖర్చులు ఉంటాయి. కుటుంబంలో ఒకరి కోసం తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

    సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఏ చిన్న అనారోగ్యం వచ్చిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. లేకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వాహనాలపై ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు శత్రువులపై కన్నేసి ఉంచాలి. కొందరు ఉద్యోగులు మానసికంగా ఆందోళనతో ఉంటారు.

    కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వ్యాపారాలకు ఈరోజు సాధారణ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉంటుంది. కుటుంబంలో వివాదం నెలకొంటుంది. అయితే మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వినడానికి మరికొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు చేపడతారు.

    తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈరోజు మీ రాశి వారు ప్రశాంతంగా ఉంటారు విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. గతంలో ఉన్న మానసిక ఇబ్బందులు నేటితో తొలగిపోతాయి. విదేశాలనుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణ ఉంటుంది. లక్ష్యాలను పూర్తి చేయడం వల్ల అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. దూర ప్రయాణాలు చేయడానికి ప్లాన్ చేస్తారు. పాత స్నేహితులను కలవడంతో ఉల్లాసంగా ఉంటారు.

    వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త ప్రాజెక్టులు చేపడతారు. ఇవి భవిష్యత్తులో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు వేస్తారు. బ్యాంకు రుణం పొందేందుకు ప్రయత్నాలు చేస్తారు. అయితే వ్యాపారులను కొందరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. అందువల్ల ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : అప్పుల నుంచి బయటపడేందుకు మార్గం దొరుకుతుంది. దీంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెడతారు. వ్యాపారులు కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొత్త ఒప్పందాలు తీసుకునే ముందు పెద్దలను సంప్రదించడం మంచిది. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. పిల్లల కెరీర్ పై ప్రత్యేక నిర్ణయం తీసుకుంటారు.

    మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : మీ రాశి వారు ఆర్థికంగా ఉంచుకుంటారు. కుటుంబంలో సమస్య ఏర్పడినా దానిని వెంటనే పరిష్కరించుకుంటారు. ఇంట్లో ఒకరి వివాహం గురించి తీవ్రంగా చర్చ జరుగుతుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్స్ ఇస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. విదేశాలు ఉండేవారిని శుభవార్తలు వింటారు. అనుకోకుండా ప్రయాణాలు ఉంటాయి. అయితే వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి.

    కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు. కొందరు వీరి అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతారు. అయితే కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కాస్త కష్టపడితే అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు కెరీర్ పై దృష్టి పెడతారు. పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యక్తిగత పనులను పూర్తి చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తారు.

    మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారికి కొన్ని పనులు పూర్తి చేయడానికి సమయం తక్కువగా ఉంటుంది. అందువల్ల సమయాన్ని వృథా చేయొద్దు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆదాయాన్ని పెంచుకునే మార్గం పెంచుకోవాలి. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి. అధికారుల నుంచి కొందరు ఒత్తిడిని ఎదుర్కొంటారు. రాజకీయాల్లో ఉండేవారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం. కొత్తగా పెట్టుబడును పెట్టే వారు పెద్దల సలహా తీసుకోవాలి.