Eating Sprouts: మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే సంగతి తెలిసిందే. పెసర్లు, నల్ల శనగలు, చిక్కుళ్లను రాత్రంతా నానబెడితే మరుసటిరోజు ఉదయానికి మొలకలుగా మారతాయి. మొలకెత్తిన విత్తనాలను రోజూ తినడం ద్వారా సులువుగా బరువు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. మొలకెత్తిన విత్తనాల వల్ల ఇతర అనారోగ్య సమస్యలకు సైతం చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.
మొలకెత్తిన విత్తనాలు తినడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి. అయితే మొలకెత్తిన విత్తనాల వల్ల కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఖాళీ కడుపుతో మొలకెత్తిన విత్తనాలను తీసుకోకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పచ్చి మొలకలలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా వల్ల కొన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది.
Also Read: పిల్లలలో ఈ లక్షణాలు కనబడుతున్నాయా.. కచ్చితంగా డెంగ్యు కావచ్చు!
పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలకు ఈ విధంగా ఎక్కువగా జరుగుతుంది. మొలకలు తిన్న 12 నుంచి 72 గంటల తర్వాత కొంతమందికి అతిసారం, పొత్తి కడుపు తిమ్మిర్లు, వాంతులు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. పచ్చి మొలకలు తినేవాళ్లలో కొంతమందిని జీర్ణ సంబంధిత సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. వీళ్లు ఉడికించిన మొలకలను తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని తెలుస్తోంది.
వేడి చేసిన మొలకలలో ఉండే పోషకాలను శరీరం పూర్తిస్థాయిలో గ్రహిస్తుంది. తరచూ మొలకెత్తిన విత్తనాలను తీసుకునే వాళ్లు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలను తీసుకుంటే మంచిది.
Also Read: ప్రతిరోజు చపాతీలు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?